News September 23, 2025
మైసూరులో ప్రారంభమైన దసరా ఉత్సవాలు

ప్రపంచ ప్రసిద్ధి చెందిన మైసూరు దసరా(నాడా హబ్బ) ఉత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ గ్రహీత, రచయిత్రి భాను ముష్తాక్, కర్ణాటక CM సిద్దరామయ్యతో కలిసి ఉత్సవాలు ప్రారంభించారు. చాముండేశ్వరి ఆలయంలో పుష్పవృష్టితో మొదలైన ఈ 11 రోజుల పండుగలో సాంస్కృతిక కార్యక్రమాలు, ఊరేగింపులు ఉంటాయి. అక్టోబర్ 2న జంబో సవారితో ముగిసే ఈ వేడుకలు కర్ణాటక రాజవంశ వారసత్వాన్ని, ప్రగతిని ప్రదర్శిస్తాయి.
Similar News
News September 23, 2025
ప్లాన్ ప్రకారం రెచ్చిపోతున్న పాక్ ప్లేయర్లు!

పాక్ క్రికెటర్లు ప్లాన్ ప్రకారం కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు. 6 రఫేల్ జెట్లను కూల్చామంటూ(6-0) భారత్‌తో మ్యాచ్‌లో రవూఫ్ సంజ్ఞలు చేసిన విషయం తెలిసిందే. దీన్ని ఉమెన్ క్రికెటర్లూ అనుసరిస్తున్నారు. నిన్న SAతో జరిగిన ODIలో పాక్ ఉమెన్ ప్లేయర్స్ సిద్రా అమీన్, నష్రా సందూ చేతి వేళ్లతో 6 నంబర్ చూపిస్తూ సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ ఫొటోలను పాక్ ఫ్యాన్స్ షేర్ చేస్తుండగా భారత నెటిజన్లు కౌంటరిస్తున్నారు.
News September 23, 2025
RED ALERT: ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, పిడుగులు

AP: రాబోయే 3-4 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది. విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని రెడ్ అలర్ట్ జారీ చేసింది. శ్రీకాకుళం, కోనసీమ, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. తిరుపతి, కర్నూలు, నంద్యాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పిడుగులు పడతాయని, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.
News September 23, 2025
నవరాత్రుల్లో నవదుర్గలకు సమర్పించాల్సిన నైవేద్యాలు

1. బాలాత్రిపుర సుందరీ దేవి: బెల్లపు పరమాన్నం
2. శ్రీ గాయత్రీ దేవి: నిమ్మకాయ పులిహోర
3. శ్రీ అన్నపూర్ణా దేవి: దద్దోజనం
4. లలితా త్రిపుర సుందరీ దేవి: దద్దోజనం, పరమాన్నం
5. శ్రీ మహాలక్ష్మీ దేవి: క్షీరాన్నం, పూర్ణాలు
6. శ్రీ సరస్వతీ దేవి: కట్టు పొంగలి
7. దుర్గాదేవి: పులగం, కదంబం
8. మహిషాసురమర్దని: పులిహోర, గారెలు, పానకం వడపప్పు
9. శ్రీ రాజరాజేశ్వరీ దేవి: శాకాన్నం