News September 23, 2025

జూబ్లీహిల్స్‌ క్లాస్ అనుకుంటున్నారా.. ఊర మాస్!

image

జూబ్లీహిల్స్‌ను అంతా కాస్ట్‌లీ నియోజకవర్గమని పిలుస్తారు. విశాలమైన భవనాలు, కమర్షియల్ కాంప్లెక్స్‌లతో గ్రాండ్‌గా కనిపిస్తది. కానీ, జూబ్లీహిల్స్‌ MLAను ఎన్నుకునేది మాత్రం పేదలే అని ఎందరికి తెలుసు. అవును, నియోజవకర్గంలోని మెజార్టీ డివిజన్లు పక్కా మాస్. షేక్‌పేట, ఎర్రగడ్డ, బోరబండ, రహమత్‌నగర్‌, యూసుఫ్‌గూడ‌, సోమాజిగూడ‌లోని మధ్య తరగతి, పేదలే ఓట్లేస్తారు. ఇక్కడ అందమైన భవంతులే కాదు అంతకుమించి బస్తీలున్నాయి.

Similar News

News September 23, 2025

కాణిపాకం బైపాస్ వద్ద రోడ్డు ప్రమాదం..ఒకరి స్పాట్ డెడ్

image

చిత్తూరు జిల్లా కాణిపాకం బైపాస్ నాలుగు రోడ్ల వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు అక్కడికక్కడే మృతిచెందాడు. మృతి చెందిన వ్యక్తి మూర్తిగారి గ్రామవాసిగా స్థానికులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News September 23, 2025

VJA: ఇంద్రకీలాద్రి దుర్గమ్మ పుట్టిల్లు.. ధనకొండ

image

ఇంద్రకీలాద్రిపై కొలువుతీరిన దుర్గమ్మ ముందుగా మొగల్రాజపురంలో పాదం మోపి అక్కడి నుంచి ఇంద్రకీలాద్రికి చేరారని ప్రతీతి. దీనికి ముందుగా దక్షిణాభి ముఖంగా మొగల్రాజపురం(ధనకొండ)లోని కొండపై ఒక చిన్న గుహలో శ్రీ చక్రపీఠం, పాదాలు, నేత్రాల రూపంలో కొలువుదీరారని భక్తులు చెబుతుంటారు. దసరా ఉత్సవాల్లో ప్రతి రోజు రాత్రివేళ దుర్గమ్మ ఇంద్రకీలాద్రి నుంచి మొగల్రాజపురంలోని ధనకొండ ఆలయానికి చేరుకుంటారని భక్తుల విశ్వాసం.

News September 23, 2025

ప్లాన్ ప్రకారం రెచ్చిపోతున్న పాక్ ప్లేయర్లు!

image

పాక్ క్రికెటర్లు ప్లాన్ ప్రకారం కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు. 6 రఫేల్ జెట్లను కూల్చామంటూ(6-0) భారత్‌తో మ్యాచ్‌లో రవూఫ్ సంజ్ఞలు చేసిన విషయం తెలిసిందే. దీన్ని ఉమెన్ క్రికెటర్లూ అనుసరిస్తున్నారు. నిన్న SAతో జరిగిన ODIలో పాక్ ఉమెన్ ప్లేయర్స్ సిద్రా అమీన్, నష్రా సందూ చేతి వేళ్లతో 6 నంబర్ చూపిస్తూ సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ ఫొటోలను పాక్ ఫ్యాన్స్ షేర్ చేస్తుండగా భారత నెటిజన్లు కౌంటరిస్తున్నారు.