News September 23, 2025

సూర్యాపేట: ప్రజావాణిలో 11 ఫిర్యాదులు

image

ప్రజా సమస్యల పరిష్కారంలో భాగంగా ఫిర్యాదులపై వెంటనే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ కె.నరసింహ అన్నారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 11 అర్జీలను ఆయన పరిశీలించారు. ప్రజలు అత్యవసర సమయంలో డయల్‌ 100కు ఫోన్‌ చేసి పోలీసు సేవలు పొందాలని ఆయన సూచించారు.

Similar News

News September 23, 2025

KNR: ప్రజావాణికి 318 దరఖాస్తులు

image

కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రజావాణిలో భాగంగా కలెక్టరేట్ ఆడిటోరియంలో అడిషనల్ కలెక్టర్ లక్ష్మి కిరణ్, మునిసిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వర్లు ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. 318 అర్జీలు రాగా సత్వర పరిష్కారం కోసం వాటిని సంబంధిత శాఖల అధికారులకు బదిలీ చేశారు. పెండింగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

News September 23, 2025

GDK: ‘కార్మికులకు అన్యాయం జరిగింది’

image

సింగరేణి లాభాల వాటా కంపెనీలో కార్మికులకు అన్యాయం జరిగిందని గుర్తింపు కార్మిక సంఘం(AITUC) అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య అన్నారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. CM రేవంత్ రెడ్డి ఏకపక్షంగా ప్రకటించారని అన్నారు. వాస్తవ లాభాలలో కార్మికులకు వాటా ఇవ్వాల్సి ఉండేదన్నారు. కార్మిక సంఘాల నాయకులకు ఎలాంటి సమాచారం లేకుండా ప్రకటించడం సరైన విధానం కాదన్నారు.

News September 23, 2025

కాణిపాకం బైపాస్ వద్ద రోడ్డు ప్రమాదం..ఒకరి స్పాట్ డెడ్

image

చిత్తూరు జిల్లా కాణిపాకం బైపాస్ నాలుగు రోడ్ల వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు అక్కడికక్కడే మృతిచెందాడు. మృతి చెందిన వ్యక్తి మూర్తిగారి గ్రామవాసిగా స్థానికులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.