News September 23, 2025
స్వామి వారిని దర్శించుకున్న విదేశీయుల బృందం

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని వివిధ దేశాలకు చెందిన 30 మంది ప్రతినిధులు దర్శించుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న ‘ట్రైనింగ్ ఆఫ్ మీడియా మేనేజ్‌మెంట్’ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన శ్రీలంక, వియత్నాం, థాయ్‌లాండ్, ఈజిప్ట్ తదితర 25 దేశాలకు చెందిన ఈ బృందం స్వామివారిని దర్శించుకుంది. దర్శనం అనంతరం వీరికి ఆలయ అధికారులు వేద ఆశీర్వచనం అందజేశారు.
Similar News
News September 23, 2025
నవరాత్రుల్లో నవదుర్గలకు సమర్పించాల్సిన నైవేద్యాలు

1. బాలాత్రిపుర సుందరీ దేవి: బెల్లపు పరమాన్నం
2. శ్రీ గాయత్రీ దేవి: నిమ్మకాయ పులిహోర
3. శ్రీ అన్నపూర్ణా దేవి: దద్దోజనం
4. లలితా త్రిపుర సుందరీ దేవి: దద్దోజనం, పరమాన్నం
5. శ్రీ మహాలక్ష్మీ దేవి: క్షీరాన్నం, పూర్ణాలు
6. శ్రీ సరస్వతీ దేవి: కట్టు పొంగలి
7. దుర్గాదేవి: పులగం, కదంబం
8. మహిషాసురమర్దని: పులిహోర, గారెలు, పానకం వడపప్పు
9. శ్రీ రాజరాజేశ్వరీ దేవి: శాకాన్నం
News September 23, 2025
నవరాత్రుల్లో చేయాల్సిన దానాలు – ఫలితాలు (1/2)

1. బాలాత్రిపుర సుందరీ దేవి: వస్త్రాలు దానం చేస్తే సద్బుద్ధి కలుగుతుంది. కార్యసిద్ధి ప్రాప్తిస్తుంది.
2. గాయత్రీ దేవి: ఎర్రటి గాజులు దానం చేస్తే తేజస్సు పెరుగుతుంది.
3. అన్నపూర్ణా దేవి: అన్నదానం చేస్తే మీకు ధనధాన్యములకు లోటు ఉండదు.
4. లలితా త్రిపుర సుందరీ దేవి: సహస్ర నామ పుస్తకాలు దానం చేస్తే అఖండ కీర్తి లభిస్తుంది.
5. మహాలక్ష్మీ దేవి: దానం చేస్తే ధనప్రాప్తి కలుగుతుంది. ఐశ్వర్యం వరిస్తుంది.
News September 23, 2025
నవరాత్రుల్లో చేయాల్సిన దానాలు – ఫలితాలు (2/2)

6. సరస్వతీ దేవి: విద్యార్థులకు పుస్తకాలు దానం చేయడం వల్ల విద్యాప్రాప్తి కలుగుతుంది.
7. దుర్గాదేవి: ఎర్ర చీర దానం చేస్తే విజయం లభిస్తుంది.
8. మహిషాసుర మర్దని: స్వయం పాకం దానం చేయడం వల్ల ధైర్యం పెరుగుతుంది. విజయం లభిస్తుంది.
9. రాజరాజేశ్వరీ దేవి: పూల మాలలు దానం చేయాలి. ఫలితంగా శక్తి, సౌభాగ్యం పెరుగుతుంది.