News September 23, 2025
APPLY NOW..IPRCLలో ఉద్యోగాలు

ఇండియన్ పోర్ట్ రైల్ అండ్ రోప్‌వే కార్పొరేషన్ లిమిటెడ్(<
Similar News
News September 23, 2025
పిజ్జా తింటున్నారా? ఇవి చూడండి

ఫుడ్ సేఫ్టీ అధికారులు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 55 పిజ్జా రెస్టారెంట్లను ఒకేసారి తనిఖీ చేశారు. కిచెన్‌లలో ఎక్స్‌పైర్ అయిన వస్తువులు, నల్లటి పిజ్జా పెనం, ఇంజిన్ ఆయిల్ లాంటి నూనె, ఎక్కడ చూసినా అపరిశుభ్రంగా ఉండటాన్ని గుర్తించారు. పలు శాంపిల్స్ సేకరించారు. వెంటనే లోపాలను సరిదిద్దుకోవాలని, పరిశుభ్రతను మెయింటేన్ చేయాలని ఆదేశించారు. తనిఖీ చేసిన వాటిలో పిజ్జాహట్, డొమినోస్ వంటి సంస్థలూ ఉన్నాయి.
News September 23, 2025
₹5,500 కోట్లతో విద్యుత్ అభివృద్ధి పనులు: మంత్రి

AP: రాష్ట్రంలో గృహ, వ్యవసాయ, పారిశ్రామిక అవసరాలకు సరిపడా విద్యుత్ అందించడానికి ₹5,500 కోట్లతో వివిధ పనులు చేపట్టామని మంత్రి గొట్టిపాటి రవి కౌన్సిల్‌లో తెలిపారు. వీటితో నెట్‌వర్క్ ఓవర్‌లోడ్ తగ్గి లో ఓల్టేజి సమస్య ఉండదన్నారు. కొత్తగా అనేక పరిశ్రమలు వస్తున్నందున డిమాండ్‌కు వీలుగా 63 ప్రాంతాల్లో 33KV సబ్ స్టేషన్లు నెలకొల్పుతున్నామని చెప్పారు. స్కాడా సెంటర్ ద్వారా సమస్యలను పరిష్కరిస్తున్నామన్నారు.
News September 23, 2025
ప్లాన్ ప్రకారం రెచ్చిపోతున్న పాక్ ప్లేయర్లు!

పాక్ క్రికెటర్లు ప్లాన్ ప్రకారం కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు. 6 రఫేల్ జెట్లను కూల్చామంటూ(6-0) భారత్‌తో మ్యాచ్‌లో రవూఫ్ సంజ్ఞలు చేసిన విషయం తెలిసిందే. దీన్ని ఉమెన్ క్రికెటర్లూ అనుసరిస్తున్నారు. నిన్న SAతో జరిగిన ODIలో పాక్ ఉమెన్ ప్లేయర్స్ సిద్రా అమీన్, నష్రా సందూ చేతి వేళ్లతో 6 నంబర్ చూపిస్తూ సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ ఫొటోలను పాక్ ఫ్యాన్స్ షేర్ చేస్తుండగా భారత నెటిజన్లు కౌంటరిస్తున్నారు.