News September 23, 2025
కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న మహిళా నేతలు

విజయవాడ కనకదుర్గ అమ్మవారిని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి, పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి దర్శించుకున్నారు. దర్శనానంతరం వారికి అర్చకులు ప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. అనంతరం మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు పాలనలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.
Similar News
News September 23, 2025
ADB: సాయితేజకు కన్నీటి వీడ్కోలు

ఉట్నూర్‌కు చెందిన సాయితేజ సీనియర్ల వేధింపులకు గురై హైదరాబాద్‌లో బలవన్మరణానికి పాల్పడ్డాడు. అతడి మృతదేహాన్ని మంగళవారం ఉట్నూర్‌కు తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. గ్రామస్థులు, కుటుంబీకులు సాయితేజకు కన్నీటి వీడ్కోలు పలికారు. యువత ఇలాంటి అనాలోచిత నిర్ణయాలు తీసుకొని తల్లిదండ్రులకు కన్నీళ్లు మిగిల్చవద్దని గ్రామస్థులు కోరారు.
News September 23, 2025
కరీంనగర్: బందూకు పట్టిన బడిపంతులు

విద్యాబోధనతో భావి తరాలకు వెలుగులు నింపాల్సిన చేతులు తుపాకీ పట్టి, విప్లవ పోరాటంలో కనుమరుగయ్యాయి. ఉమ్మడి KNR(D) కోహెడ(M) తీగలకుంటపల్లికి చెందిన కట్టా రామచంద్రారెడ్డి.. ఒకప్పుడు భూపాలపల్లి, సిద్దిపేట జిల్లాల్లో ఉపాధ్యాయుడిగా పనిచేశారు. 1989లో విప్లవోద్యమానికి ఆకర్షితులై, భార్యతో కలిసి పీపుల్స్ వార్‌లో చేరారు. ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌లో సోమవారం రామచంద్రారెడ్డి మృతిచెందిన విషయం తెలిసిందే.
News September 23, 2025
GST 2.0పై కేంద్రానికి ఫిర్యాదుల వెల్లువ!

GST కొత్త శ్లాబులు అమలులోకి వచ్చినా కొన్ని ఇ-కామర్స్ సైట్స్ ప్రయోజనాలను బదిలీ చేయట్లేదని కేంద్రానికి ఫిర్యాదులొచ్చాయి. వీటిపై కేంద్రం ఆరా తీస్తోంది. ‘ఈ ఫిర్యాదులపై వెంటనే స్పందించలేం. అన్ని సైట్లలో ధరల మార్పులను గమనిస్తున్నాం. సెప్టెంబర్ 30 కల్లా ఓ నివేదిక వస్తుంది’ అని కేంద్రం తెలిపింది. మీకూ ఇలాంటి అనుభవమే ఎదురైతే టోల్ ఫ్రీ నంబర్ 1915, www.consumerhelpline.gov.inలో ఫిర్యాదు చేయొచ్చు.
ShareIt.