News September 23, 2025

బెండలో మొజాయిక్ వైరస్‌ను ఎలా నివారించాలి?

image

బెండ తోటల్లో మొజాయిక్ వైరస్ వ్యాప్తికి తెల్లదోమ ప్రధాన కారణం. పంటలో ఈ దోమ ఉద్ధృతిని గుర్తించిన వెంటనే సస్యరక్షణ చర్యలు తీసుకోవాలి. తెల్లదోమ నివారణకు లీటరు నీటిలో డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ 1.5 గ్రాములను కలిపి వారం రోజుల వ్యవధితో రెండు సార్లు పిచికారీ చేయాలి. తోటలో కోతకు వచ్చిన బెండ కాయలను పురుగుమందుల పిచికారీకి ముందే కోసేయాలి. దీని వల్ల వాటిలో పురుగు మందుల అవశేషాలు లేకుండా ఉంటాయి.

Similar News

News September 23, 2025

YCP ప్రభుత్వంలో పెట్టిన తప్పుడు కేసులపై త్వరలో నిర్ణయం: అనిత

image

AP: గత ప్రభుత్వంలో రాజకీయ నేతలు, మీడియా, అమరావతి ఉద్యమకారులపై పోలీసులు పెట్టిన కేసులపై CM త్వరలో సమీక్షించి నిర్ణయం తీసుకుంటారని హోంమంత్రి అనిత కౌన్సిల్‌లో ప్రకటించారు. ‘YCP ప్రభుత్వం 2019-24 మధ్య 3116 తప్పుడు కేసులు నమోదు చేసింది. న్యాయమడిగినా, తప్పులను ఎత్తి చూపినా కేసులు పెట్టారు. నాపైనా అట్రాసిటీ కేసు పెట్టారు’ అని పేర్కొన్నారు. న్యాయ, పోలీసు శాఖలతో చర్చించి వీటిని పరిష్కరిస్తామని తెలిపారు.

News September 23, 2025

ఇన్‌కమ్ ట్యాక్స్ చెల్లించింది ఎందరో తెలుసా?

image

దేశంలో 142.21 కోట్ల జనాభా ఉంటే అందులో 3.51 కోట్ల మందే FY2024-25లో ఆదాయ పన్ను చెల్లించినట్లు ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. 51.69కోట్ల మంది పాన్ & ఆధార్ లింక్ చేశారని, అందులో 7.20 కోట్ల మంది ITR దాఖలు చేసినట్లు ట్వీట్స్ చేస్తున్నారు. కేవలం 4శాతం మంది మాత్రమే పన్ను చెల్లిస్తున్నారని పేర్కొంటున్నారు. అయితే అభివృద్ధి చెందిన దేశాల్లో 50% మంది పన్ను చెల్లిస్తారని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

News September 23, 2025

డిసెంబర్ 5న ‘అఖండ-2’ విడుదల: బాలకృష్ణ

image

బోయపాటి శ్రీను తెరకెక్కిస్తోన్న ‘అఖండ-2’ సినిమా విడుదల తేదీపై హీరో నందమూరి బాలకృష్ణ క్లారిటీ ఇచ్చారు. ఏపీ అసెంబ్లీ లాబీలో జరిగిన చిట్ చాట్‌లో ఆయన మాట్లాడారు. ‘ఎల్లుండి తమ్ముడు పవన్ OG మూవీ విడుదలవుతోంది. డిసెంబర్ 5న అఖండ-2 రాబోతోంది. పాన్ ఇండియా సినిమాగా వివిధ భాషల్లో తీసుకొస్తున్నాం. హిందీ డబ్బింగ్ కూడా చాలా బాగా వచ్చిందని బోయపాటి చెప్పారు. అన్ని భాషల్లో ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తాం’ అని తెలిపారు.