News September 23, 2025

ADB: స్థానిక పోరు.. చేరికల జోరు

image

స్థానిక ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అందుకే చేరికలపై దృష్టి సారించాయి. అన్ని పార్టీలు మీటింగ్లు పెడుతూ గ్రామం నుంచి జిల్లాస్థాయి వరకు నాయకులను చేర్చుకుంటున్నాయి. కాంగ్రెస్‌ను వీడిన నేతలు మళ్లీ పార్టీలో చేరారు. మండల స్థాయి సమావేశాలు పెడుతూ BJP చేరికలపై ఫోకస్ పెట్టింది. తమ ప్రభుత్వం ఉన్నప్పుడే బాగుండే మళ్లీ ఆరోజులు రావాలంటూ BRS జోరు పెంచింది. లోకల్ వార్ రసవత్తరంగా మారింది.

Similar News

News September 23, 2025

అధిక ఛార్జీలు వసూలు చేస్తే చర్యలు తప్పవు: డీటీఓ

image

దసరా పండుగను ఆసరాగా తీసుకుని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు అధిక ఛార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా రవాణాధికారి దేవిశెట్టి శ్రీనివాసరావు హెచ్చరించారు. మంగళవారం అమలాపురంలో ఆయన మాట్లాడారు. ఇప్పటికే జిల్లాలో 388 ప్రైవేట్ బస్సులను తనిఖీ చేసి, రూ.33 లక్షల జరిమానా వసూలు చేసినట్లు తెలిపారు. ప్రయాణీకుల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తూ, ప్రతి వారం తనిఖీలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

News September 23, 2025

YCP ప్రభుత్వంలో పెట్టిన తప్పుడు కేసులపై త్వరలో నిర్ణయం: అనిత

image

AP: గత ప్రభుత్వంలో రాజకీయ నేతలు, మీడియా, అమరావతి ఉద్యమకారులపై పోలీసులు పెట్టిన కేసులపై CM త్వరలో సమీక్షించి నిర్ణయం తీసుకుంటారని హోంమంత్రి అనిత కౌన్సిల్‌లో ప్రకటించారు. ‘YCP ప్రభుత్వం 2019-24 మధ్య 3116 తప్పుడు కేసులు నమోదు చేసింది. న్యాయమడిగినా, తప్పులను ఎత్తి చూపినా కేసులు పెట్టారు. నాపైనా అట్రాసిటీ కేసు పెట్టారు’ అని పేర్కొన్నారు. న్యాయ, పోలీసు శాఖలతో చర్చించి వీటిని పరిష్కరిస్తామని తెలిపారు.

News September 23, 2025

ఇన్‌కమ్ ట్యాక్స్ చెల్లించింది ఎందరో తెలుసా?

image

దేశంలో 142.21 కోట్ల జనాభా ఉంటే అందులో 3.51 కోట్ల మందే FY2024-25లో ఆదాయ పన్ను చెల్లించినట్లు ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. 51.69కోట్ల మంది పాన్ & ఆధార్ లింక్ చేశారని, అందులో 7.20 కోట్ల మంది ITR దాఖలు చేసినట్లు ట్వీట్స్ చేస్తున్నారు. కేవలం 4శాతం మంది మాత్రమే పన్ను చెల్లిస్తున్నారని పేర్కొంటున్నారు. అయితే అభివృద్ధి చెందిన దేశాల్లో 50% మంది పన్ను చెల్లిస్తారని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.