News September 23, 2025
MDK: రిజర్వేషన్ల వైపు వారి చూపు

స్థానిక ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వ యంత్రాంగం సిద్ధమవుతుండగా ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. తాము పోటీ చేయాలనుకుంటున్న స్థానం రిజర్వేషన్ అనుకూలంగా వస్తుందో లేదోనని ఆందోళన చెందుతున్నారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ పదవుల మీద కన్నేసిన వారంతా రిజర్వేషన్ల ప్రకటన కోసం నిరీక్షిస్తున్నారు. రిజర్వేషన్లు ఖరారయ్యాక రాజకీయం వేడెక్కనుంది. ఈరోజు సాయంత్రం వరకు రిజర్వేషన్లపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
Similar News
News September 23, 2025
మెదక్: కమీషన్లు చెల్లించకపోవడం దుర్మార్గం: హరీశ్‌రావు

నెలల తరబడి రేషన్ కమీషన్ చెల్లించకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ డీలర్ల జీవితాలతో చెలగాటం ఆడటం దుర్మార్గం అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పేదలకు రేషన్ బియ్యం పంపిణీ చేస్తూ, వారి ఆకలి తీర్చుతున్న రేషన్‌డీలర్లకు.. కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాల తీరుతో పస్తులుండే పరిస్థితి రావడం శోచనీయం అని పేర్కొన్నారు.
News September 23, 2025
నర్సాపూర్: అనుమానాస్పద స్థితిలో డ్రైవర్ మృతి

శివంపేట మండలం పిల్లుట్ల గ్రామానికి చెందిన దాసరి నర్సింలు(40) అనే డ్రైవర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఆదివారం నర్సాపూర్‌లో తన స్నేహితులతో కలిసి మద్యం తాగుతూ అపస్మారక స్థితిలోకి వెళ్లగా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News September 23, 2025
టేక్మాల్: అక్రమంగా తరలిస్తున్న యూరియా పట్టివేత

అక్రమంగా యూరియాను తరలిస్తున్న డీసీఎం వాహనాన్ని మెదక్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. సీఐ కృష్ణమూర్తి తన సిబ్బందితో కలిసి దాడి చేసి వాహనంలో ఉన్న 250 యూరియా సంచులను సీజ్ చేశారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బ్లాక్ మార్కెట్ చేస్తే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.