News September 23, 2025
ఐఐఆర్ఎస్ఆర్ ఏర్పాటు ఇంకెప్పుడూ….?

టిష్యూ కల్చర్ పద్ధతిలో అభివృద్ధి చేసి ఎర్రచందనాన్ని తక్కువ సమయంలో ఎక్కువ లాభాలను ఇచ్చే మొక్కగా అభివృద్ధి చేయాలని కేంద్ర పర్యావరణ అటవీశాఖ 2022లో నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం ఏపీలో ఎర్రచందన పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని మంజూరు చేసినప్పటికీ, అది ఇంకా పూర్తి స్థాయిలో అమలు కాలేదు. ల్యాబ్‌లో పరిశోధన దశలో ఉన్న ఎర్రచందనాన్ని రైతులు పెంచుకునేందుకు ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది.
Similar News
News September 23, 2025
వన్డేల్లో కోహ్లీ ఆడతారా? ఆడరా?

భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ వన్డేల్లో కొనసాగడంపై అనుమానాలు నెలకొన్నాయి. వచ్చే నెలలో AUSతో వన్డే సిరీస్‌కు ముందు AUS-Aతో ODI సిరీస్‌లో ఆడాలని రోహిత్, కోహ్లీకి BCCI సూచించినట్లు క్రీడా వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే రోహిత్ ప్రాక్టీస్ మొదలెట్టగా, BCCIకి కోహ్లీ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదని సమాచారం. దీంతో ఆయన ఆడటంపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం విరాట్ తన ఫ్యామిలీతో లండన్‌లో ఉంటున్నారు.
News September 23, 2025
పాడేరు: మ్యూటేషన్ల పనులను వేగవంతం చేయాలి

మ్యూటేషన్ల పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ దినేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. సంతృప్తికరమైన సేవలు అందించి, పీజీఆర్ఎస్ ఫీడ్ బ్యాక్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. మంగళవారం పాడేరు కలెక్టరేట్ నుంచి అధికారులతో వీసీ నిర్వహించారు. మ్యూటేషన్ల ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. పెండింగ్‌లో ఉన్న మ్యూటేషన్లకు సంబంధించి ప్రణాళికలు రూపొందించి, త్వరితగతిన పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు.
News September 23, 2025
అధిక ఛార్జీలు వసూలు చేస్తే చర్యలు తప్పవు: డీటీఓ

దసరా పండుగను ఆసరాగా తీసుకుని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు అధిక ఛార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా రవాణాధికారి దేవిశెట్టి శ్రీనివాసరావు హెచ్చరించారు. మంగళవారం అమలాపురంలో ఆయన మాట్లాడారు. ఇప్పటికే జిల్లాలో 388 ప్రైవేట్ బస్సులను తనిఖీ చేసి, రూ.33 లక్షల జరిమానా వసూలు చేసినట్లు తెలిపారు. ప్రయాణీకుల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తూ, ప్రతి వారం తనిఖీలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.