News September 23, 2025
ప్రెగ్నెన్సీ ప్రకటించిన కత్రినా కైఫ్

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ త్వరలో తల్లి కాబోతున్నారు. ఈ విషయాన్ని కత్రినాతో పాటు ఆమె భర్త విక్కీ కౌశల్ ప్రకటించారు. ‘మా జీవితాల్లో బెస్ట్ ఛాప్టర్‌ను ఆరంభించబోతున్నాం’ అని పేర్కొంటూ ఇన్‌స్టాలో బేబీ బంప్‌తో ఉన్న ఫొటోను షేర్ చేశారు. స్టార్ కపుల్‌కు ఇండస్ట్రీ, ఫ్యాన్స్ నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. కాగా 2021లో వీరిద్దరూ వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే.
Similar News
News September 23, 2025
డయాబెటిస్ లక్షణాలు ఇవే..

*బరువు తగ్గిపోవడం
*కంటిచూపు మందగించడం
*తరచూ పుండ్లు కావడం. గాయాలు, దెబ్బలు త్వరగా మానకపోవడం
*బాగా అలసిపోవడం
*అధికంగా దాహం వేయడం
*ఎక్కువసార్లు మూత్ర విసర్జన
>షుగర్ లెవల్స్ ఎక్కువగా ఉండే ప్రాసెస్డ్ ఫుడ్, కూల్ డ్రింక్స్ తీసుకోవద్దు. కూరగాయాలు, పండ్లు, బీన్స్, ఒమేగా-3 పుష్కలంగా ఉండే చేపలు తినాలి. క్రమం తప్పకుండా వాకింగ్, వ్యాయామం చేయాలని వైద్యులు సూచిస్తున్నారు.
Share It
News September 23, 2025
దక్షిణాదిలో జనాభా తగ్గిపోతోంది: చంద్రబాబు

AP: అభివృద్ధి చెందిన దేశాల్లో జనాభా తగ్గిపోతోందని సీఎం చంద్రబాబు అసెంబ్లీలో పేర్కొన్నారు. ‘మన దేశంలో సగటు జీవిత కాలం 70 ఏళ్లుగా ఉంది. దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా తగ్గుతోంది. యూపీ, బిహార్ వల్లే ఆ లెక్కలు బ్యాలెన్స్ అవుతున్నాయి. వచ్చే ఏడాదికి రాష్ట్రంలో జనాభా 5.37 కోట్లకు చేరుకుంటుంది. WHO ప్రకారం మన రాష్ట్రంలోనే PHCలు, మెడికల్ ఆఫీసర్లు ఎక్కువగా ఉన్నారు’ అని తెలిపారు.
News September 23, 2025
ఈ సీజన్‌లో రూ.లక్ష కోట్ల బిజినెస్!

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈకామర్స్ సైట్లలో ఇవాళ్టి నుంచి భారీ ఆఫర్లు మొదలయ్యాయి. దీంతో ఇండియాలోని ఈ సంస్థల ఆఫీసులు వార్ రూములను తలపిస్తున్నాయి. ఈ సీజన్‌లో ఏకంగా 25లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. 1.2ట్రిలియన్ సేల్స్ జరుగుతాయని టెక్ నిపుణుల అంచనా. మొత్తం రూ.లక్ష కోట్ల రెవెన్యూ జనరేట్ అవుతుందని సమాచారం. అర్ధరాత్రి నుంచే సేల్స్ విపరీతంగా జరుగుతుండటం విశేషం.