News September 23, 2025
వైకుంఠం జ్యోతి ఎవరు?

ఆలూరు టీడీపీ ఇన్‌ఛార్జిగా వైకుంఠం జ్యోతి నియమితులయ్యారు. <<17795004>>వైకుంఠం<<>> ఫ్యామిలీ ఆవిర్భావం నుంచి టీడీపీలో కొనసాగుతోంది. జ్యోతి మామ శ్రీరాములు 1995లో KDCC బ్యాంకు ఛైర్మన్‌గా పనిచేశారు. 2006లో ఆయన హత్యకు గురయ్యారు. తర్వాత తనయుడు, జ్యోతి భర్త ప్రసాద్ 2011లో ఇన్‌ఛార్జిగా బాధ్యతలు చేపట్టారు. పలుమార్లు MLA టికెట్ ఆశించినా అవకాశం రాలేదు. పార్టీలోనే కొనసాగుతున్న ఆ ఫ్యామిలీకి మరోసారి ఇన్‌ఛార్జి పదవి దక్కింది.
Similar News
News September 23, 2025
WNP: దసరా పండుగకు ఊరెళ్లేవారు జాగ్రత్తలు పాటించాలి

దసరా పండుగ సందర్భంగా ఊరికి వెళ్లేవారు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని వనపర్తి జిల్లా ఎస్పీ గిరిధర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పండగల కోసం కుటుంబంతో సహా తమ స్వగ్రామాలకు వెళ్లేవారు ఇరుగుపొరుగు వారికి సమాచారం ఇచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చి వెళ్లాలన్నారు. విలువైన వస్తువులు ఇంట్లో పెట్టకుండా బ్యాంకు లాకర్లో లేదా తమ వెంట తీసుకెళ్లడం మంచిదని అన్నారు.
News September 23, 2025
తిరుమల: రికార్డ్ క్రియేట్ చేయబోతున్న చంద్రబాబు.!

నూతన రికార్డ్ ఏపీ సీఎం చంద్రబాబు ఖాతాలో చేరనుంది. 15 సార్లు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన భాగ్యం దక్కిన ఏకైక సీఎంగా రికార్డ్ క్రియేట్ చేయనున్నారు. 16ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు 2003లో బాంబ్ బ్లాస్ట్ కారణంగా పట్టువస్త్రాలు సమర్పించలేక పోయారు. దీంతో రాష్ట్ర ప్రభుర్వం తరఫున అప్పటీ టీటీడీ ఛైర్మన్ పప్పుల చలపతిరావు స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు.
News September 23, 2025
అక్టోబర్ 8 నుంచి TU ఎం.ఎడ్ పరీక్షలు

తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని ఎం.ఎడ్ పరీక్షల షెడ్యూల్‌ను అధికారులు విడుదల చేశారు. రెగ్యులర్ II సెమిస్టర్ థియరీ పరీక్షలు అక్టోబర్ 8 నుంచి 15వరకు జరుగుతాయని పరీక్షల నియంత్రణ అధికారి ప్రొఫెసర్ కే. సంపత్ కుమార్ తెలిపారు. పూర్తి వివరాలను విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు ఆయన పేర్కొన్నారు.