News September 23, 2025
ADB: 3 రోజుల్లో రిజర్వేషన్లు.. అంతటా ఉత్కంఠ..!

స్థానిక ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేరికలపై దృష్టి సారించాయి. ఇప్పటికే ఓటరు ముసాయిదా, పోలింగ్ స్టేషన్ల ఏర్పాటుపై కసరత్తు మొదలైంది. రిజర్వేషన్లు ఖరారవ్వడమే లేటు అనుకున్న సమయంలో ప్రభుత్వం 2, 3 రోజుల్లో ఖరారు చేయాలని నిర్ణయించింది. ఈసారి BCలకు 42% కల్పించే అవకాశాలుండటంతో ఆశావహులు పెద్దఎత్తున బరిలో నిలవనున్నారు. ఉమ్మడి ADBలో GP 1514, MPTC 581, ZPTC 69 స్థానాలున్నాయి.
Similar News
News September 23, 2025
అన్నమయ్య జిల్లాలో PAI 2.0 వర్క్‌షాప్ నిర్వహణ

అన్నమయ్య జిల్లా JC కలెక్టర్ అధ్యక్షతన PGRS హాల్‌లో పంచాయతీ పురోగతి సూచిక 2.0 పై మంగళవారం ఒకరోజు వర్క్‌షాప్ విజయవంతంగా నిర్వహించబడింది. జిల్లా, డివిజనల్, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. వర్క్‌షాప్‌లో 2030 సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధన కోసం గ్రామ పంచాయతీల పనితీరు పర్యవేక్షణ, డేటా ఆధారిత పాలన, వివిధ వనరులు మరియు భాగస్వామ్యాలను సమన్వయం చేయడం వంటి అంశాలపై శిక్షణ ఇవ్వబడిందని అధికారులు తెలిపారు.
News September 23, 2025
HYD: బొనాంజా ఆఫర్.. నమ్మితే నట్టేట మునిగినట్టే!

దసరా పండుగను సైబర్ నేరగాళ్లు ‘క్యాష్’ చేసుకుంటున్నారు. బొనాంజా ఆఫర్ పేరుతో వాట్సప్, ఇన్‌స్టా, టెలిగ్రామ్‌లో లింక్‌లు పంపిస్తూ 75 నుంచి 100% డిస్కౌంట్ ఇస్తామని గాలం వేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ నాచారంలో వ్యక్తి ఈ గాలానికి చిక్కి రూ.18,987 పోగొట్టుకున్నాడు. అందుకే దసరా సందర్భంగా వచ్చే లింక్‌లను క్లిక్ చేయకపోవడం బెటర్.
News September 23, 2025
కడప: ‘అక్టోబర్ 2 నాటికి స్మార్ట్ కిచెన్లు సిద్ధం చేయాలి’

జిల్లా వ్యాప్తంగా ఆయా మండలాలలో అక్టోబర్ రెండు నాటికి స్మార్ట్ కిచెన్లు అందుబాటులోకి రావాలని జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ అన్నారు. మంగళవారం JC అతిధి సింగ్‌తో కలిసి స్మార్ట్ కిచెన్ల భవన నిర్మాణాల పురోగతిపై సమీక్ష చేపట్టారు. స్మార్ట్ కిచెన్లు అన్ని మండలాల్లో ఓకే డిజైన్‌లో ఉండాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని మరింత నాణ్యతగా, రుచికరంగా అందించాలన్నారు.