News September 23, 2025

ఈ అలవాట్లు అందానికి శత్రువులు

image

మచ్చలు లేకుండా అందంగా మెరుస్తూ ఉండే చర్మం కావాలని ప్రతి అమ్మాయీ కోరుకుంటుంది. అయితే దీనికోసం కొన్నిజాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు చర్మనిపుణులు. కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే ఆహారం, పాల ఉత్పత్తులు మితంగా తీసుకోవాలి. చక్కెర, జంక్ ఫుడ్స్‌కి దూరంగా ఉండాలి. ఎవరో చెప్పారని చర్మంపై ప్రయోగాలు చెయ్యకూడదు. కంటినిండా నిద్ర చర్మ ఆరోగ్యానికి చాలా ముఖ్యం. పడుకొనే ముందు మేకప్ తొలగించాలి. నీరు ఎక్కువగా తాగాలి.

Similar News

News September 23, 2025

ప్రపంచంలో నాలుగో అతిపెద్ద అంతిమయాత్రగా రికార్డు

image

అస్సామీ సింగర్ జుబీన్ గార్గ్ అంత్యక్రియలకు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కింది. ప్రపంచవ్యాప్తంగా నాలుగో అతి పెద్ద ఫ్యూనరల్ గ్యాదరింగ్‌గా దీనిని గుర్తించింది. మైఖేల్ జాక్సన్, పోప్ ఫ్రాన్సిస్, క్వీన్ ఎలిజబెత్-2 తర్వాత ఆయన అంత్యక్రియలకే అంతమంది హాజరయ్యారని పేర్కొంది. ఆ రద్దీతో దుకాణాలు మూసివేయడంతో పాటు ట్రాఫిక్ ఆపేశారని.. లక్షల మంది కన్నీరు కార్చడంతో గువాహటి శోకసంద్రంగా మారిందని తెలిపింది.

News September 23, 2025

ఐవీఎఫ్ ఫెయిల్ అయ్యిందా?

image

కృత్రిమంగా గర్భం దాల్చే ప్రక్రియల్లో IVF ఒకటి. అయితే కొన్నిసార్లు అండాలు, వీర్యకణాలు బాగానే ఉన్నా IVF ఫెయిల్ అవుతుంది. స్పెర్మ్‌ DNAలో సమస్య ఉంటే ఇలా అవుతుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే IVFకి వెళ్లే ముందే స్పెర్మ్‌ డి.ఎన్‌.ఎ పరీక్ష చేయించాలి. లోపాలు ఉంటే, మందులు వాడి, సరిదిద్దుకున్న తర్వాతే IVFకు వెళ్లడం మంచిది. లేదంటే అబార్షన్‌ అవడం, గర్భం దాల్చలేకపోవడం వంటివి జరుగుతాయంటున్నారు నిపుణులు.

News September 23, 2025

శ్రీవారి సేవకులకు శుభవార్త

image

AP: తిరుమల శ్రీవారి సేవకులకు TTD ఛైర్మన్ బీఆర్ నాయుడు శుభవార్త చెప్పారు. సేవా కాలం ముగిసిన అనంతరం వారికి మెరుగైన స్వామివారి దర్శనానికి ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. త్వరలోనే ఈ విషయంపై బోర్డు సమావేశంలో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల భక్తులు శ్రీవారి సేవ చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారని తెలిపారు. శ్రీవారి సేవకులు భగవద్బంధువులు అని పేర్కొన్నారు.