News September 23, 2025

ఎస్కార్ట్ విధుల్లో అప్రమత్తంగా ఉండాలి: అనకాపల్లి ఎస్పీ

image

ఎస్కార్ట్ విధులు నిర్వర్తిస్తున్న పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ తుహీన్ సిన్హా సూచించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. తూర్పుగోదావరి జిల్లాలో పోలీస్ సిబ్బంది ఎస్కార్ట్ విధులు నిర్వహిస్తుండగా నిందితుడు పరారైన నేపథ్యంలో పలు సూచనలు చేశారు. ముద్దాయిలను సంకెళ్లతో తీసుకువెళ్లాలన్నారు. ముద్దాయిల అవసరం నిమిత్తం వాహనం ఆపినప్పుడు ఇద్దరు ఎస్కార్ట్‌లు అప్రమత్తతో వ్యవహరించాలన్నారు.

Similar News

News September 23, 2025

PHOTO GALLERY: అమ్మవారి వైభవం

image

తెలుగు రాష్ట్రాల్లో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వివిధ రూపాల్లో వెలిగిపోతున్న అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయాలకు పోటెత్తుతున్నారు. ఆ జగన్మాత ఆశీస్సులు పొందుతూ పరవశించి పోతున్నారు. పలు జిల్లాల్లో అమ్మవారి అలంకారాలను ఫొటోల్లో వీక్షించి తరించండి.

News September 23, 2025

HYD:’వ‌ర‌ద భ‌యం లేని న‌గ‌ర‌మే హైడ్రా ల‌క్ష్యం’

image

HYD నగరాన్ని వరదల నుంచి కాపాడడం, ప్రజలు ఏలాంటి భయం లేకుండా జీవించేలా చేయడం హైడ్రా ప్రధాన లక్ష్యం అని కమిషనర్ రంగనాథ్ అన్నారు. వర్షాకాలంలో కొద్దిపాటి వర్షానికే నీట మునిగే పరిస్థితులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపడుతోంది. డ్రైనేజీ వ్యవస్థను బలోపేతం చేయడం, కొత్త నాలాలు, కాల్వలు నిర్మించడం, చెరువులను శుభ్రపరచడం, వర్షపు నీరు నిల్వ లేకుండా చర్యలు అమలు చేస్తోందన్నారు.

News September 23, 2025

అన్నమయ్య జిల్లాలో PAI 2.0 వర్క్‌షాప్ నిర్వహణ

image

అన్నమయ్య జిల్లా JC కలెక్టర్ అధ్యక్షతన PGRS హాల్‌లో పంచాయతీ పురోగతి సూచిక 2.0 పై మంగళవారం ఒకరోజు వర్క్‌షాప్ విజయవంతంగా నిర్వహించబడింది. జిల్లా, డివిజనల్, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. వర్క్‌షాప్‌లో 2030 సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధన కోసం గ్రామ పంచాయతీల పనితీరు పర్యవేక్షణ, డేటా ఆధారిత పాలన, వివిధ వనరులు మరియు భాగస్వామ్యాలను సమన్వయం చేయడం వంటి అంశాలపై శిక్షణ ఇవ్వబడిందని అధికారులు తెలిపారు.