News September 23, 2025

దుల్కర్, పృథ్వీరాజ్ ఇళ్లల్లో కస్టమ్స్ సోదాలు

image

హీరోలు దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్ సుకుమారన్ నివాసాల్లో కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. స్మగ్లింగ్ ఆరోపణలపై ‘ఆపరేషన్ నుమ్‌ఖోర్’ పేరుతో కేరళ వ్యాప్తంగా సోదాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే కొచ్చిలోని దుల్కర్, పృథ్వీరాజ్ నివాసాల్లో వాహనాల పత్రాలు పరిశీలించారు. పన్ను తప్పించుకునేందుకు భూటాన్ నుంచి లగ్జరీ కార్లను సెకండ్ హ్యాండ్ కార్లుగా కేరళ తెచ్చారన్న సమాచారంతో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News September 23, 2025

స్పెషల్ బస్సుల్లోనే 50% అదనపు ఛార్జీలు: సజ్జనార్

image

బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా 7 వేలకు పైగా బస్సులను నడుపుతున్నామని TGSRTC ఎండీ సజ్జనార్ తెలిపారు. ప్రత్యేక బస్సుల్లోనే 50% అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నామని, మిగతా బస్సుల్లో సాధారణ ఛార్జీలే ఉన్నాయని పేర్కొన్నారు. ‘బస్సులు తిరుగు ప్రయాణంలో ఖాళీగా వస్తున్నాయి. డీజిల్, మెయింటెనెన్స్ కోసం 50% అదనంగా వసూలు చేస్తున్నాం. ఇది కొత్త పద్ధతి కాదు.. 2003లో ఇచ్చిన GOనే అమలు చేస్తున్నాం’ అని తెలిపారు.

News September 23, 2025

4300 ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి చర్యలు: లోకేశ్

image

AP: రాష్ట్ర వర్సిటీల్లోని 4300 ప్రొఫెసర్ పోస్టులను త్వరలో భర్తీ చేస్తామని మంత్రి లోకేశ్ కౌన్సిల్‌లో వెల్లడించారు. దీనిపై ఉన్న వివాదాలను పరిష్కరించి ముందుకెళ్తామన్నారు. గతంలో అనుమతి లేకుండా కడప YSR ఆర్కిటెక్చర్, ఫైన్ఆర్ట్స్ వర్సిటీలో అడ్మిషన్లు చేయడంతో విద్యార్థులు ఇబ్బందులు పడ్డారని, వాటిని తాము పరిష్కరించామని చెప్పారు. డబుల్ ఇంజిన్ సర్కారు ఉండడం వల్ల గత తప్పులను సరిదిద్దుతున్నామని వివరించారు.

News September 23, 2025

ప్రపంచంలో నాలుగో అతిపెద్ద అంతిమయాత్రగా రికార్డు

image

అస్సామీ సింగర్ జుబీన్ గార్గ్ అంత్యక్రియలకు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కింది. ప్రపంచవ్యాప్తంగా నాలుగో అతి పెద్ద ఫ్యూనరల్ గ్యాదరింగ్‌గా దీనిని గుర్తించింది. మైఖేల్ జాక్సన్, పోప్ ఫ్రాన్సిస్, క్వీన్ ఎలిజబెత్-2 తర్వాత ఆయన అంత్యక్రియలకే అంతమంది హాజరయ్యారని పేర్కొంది. ఆ రద్దీతో దుకాణాలు మూసివేయడంతో పాటు ట్రాఫిక్ ఆపేశారని.. లక్షల మంది కన్నీరు కార్చడంతో గువాహటి శోకసంద్రంగా మారిందని తెలిపింది.