News September 23, 2025
కర్ణాటకలో కాంగ్రెస్ ఉన్నా వెనక్కి తగ్గం: ఉత్తమ్

TG: కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచేదే లేదని ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో చెప్పారు. ఈ అంశంపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా తాము వెనక్కి తగ్గబోమని స్పష్టం చేశారు. నీటి హక్కులు సాధించడంలో ఎంతవరకైనా పోరాడతామని తెలిపారు. కృష్ణా, గోదావరి జలాలపై రాజీ పడే ప్రసక్తే లేదని మంత్రి తేల్చి చెప్పారు.
Similar News
News September 23, 2025
మైథాలజీ క్విజ్ – 14 సమాధానాలు

1. రామాయణంలో వాలి కుమారుడు ‘అంగదుడు’.
2. వ్యాసుని ద్వారా దాసి కన్న బిడ్డ ‘విదురుడు’.
3. అత్రి మహాముని భార్య ‘అనసూయ’. ఈ దంపతుల కుమారుడే దత్తాత్రేయుడు.
4. కామాఖ్య దేవాలయం ‘అస్సాం’ రాష్ట్రంలో ఉంది.
5. శ్రీరామనవమి ‘చైత్ర మాసం’లో వస్తుంది.
<<-se>>#mythologyquiz<<>>
News September 23, 2025
PHOTO GALLERY: అమ్మవారి వైభవం

తెలుగు రాష్ట్రాల్లో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వివిధ రూపాల్లో వెలిగిపోతున్న అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయాలకు పోటెత్తుతున్నారు. ఆ జగన్మాత ఆశీస్సులు పొందుతూ పరవశించి పోతున్నారు. పలు జిల్లాల్లో అమ్మవారి అలంకారాలను ఫొటోల్లో వీక్షించి తరించండి.
News September 23, 2025
స్పెషల్ బస్సుల్లోనే 50% అదనపు ఛార్జీలు: సజ్జనార్

బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా 7 వేలకు పైగా బస్సులను నడుపుతున్నామని TGSRTC ఎండీ సజ్జనార్ తెలిపారు. ప్రత్యేక బస్సుల్లోనే 50% అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నామని, మిగతా బస్సుల్లో సాధారణ ఛార్జీలే ఉన్నాయని పేర్కొన్నారు. ‘బస్సులు తిరుగు ప్రయాణంలో ఖాళీగా వస్తున్నాయి. డీజిల్, మెయింటెనెన్స్ కోసం 50% అదనంగా వసూలు చేస్తున్నాం. ఇది కొత్త పద్ధతి కాదు.. 2003లో ఇచ్చిన GOనే అమలు చేస్తున్నాం’ అని తెలిపారు.