News September 23, 2025
MLG: CM మీటింగ్.. తాగునీరు లేక అల్లాడుతున్న మహిళలు

తాడ్వాయి మండలం మేడారంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో భాగంగా వేల సంఖ్యలో మహిళలు తరలివచ్చారు. సుమారు 3 గంటలకు పైగా వేచి ఉన్న తమకు కనీసం తాగునీరు, స్నాక్స్ కూడా ఇవ్వడం లేదని మహిళలు వాపోయారు. దాహం, ఆకలితో అలమటిస్తున్నామన్నారు. ఎవరిని అడిగినా కనీసం మంచినీరు ఇవ్వడం లేదని, ఉక్కపోత, దప్పికతో ఇబ్బందులు పడాల్సి వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News September 23, 2025
వరంగల్ పరిధిలో 17 ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు

వరంగల్ ట్రాఫిక్ పోలీసులు చేపట్టిన తనిఖీల్లో 17 ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు నమోదయ్యాయి. ఆదివారం నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన 16 మందితో పాటు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపిన ఒకరు పట్టుబడినట్లు ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ సుజాత తెలిపారు. వీరందరికీ కోర్టు జరిమానా విధించిందన్నారు. వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News September 23, 2025
తెలంగాణ న్యూస్ రౌండప్

☛ తిరుమల శ్రీవారికి కానుకగా 535 గ్రాముల బంగారు అష్టలక్ష్మీ చంద్రవంక కంఠిని (విలువ రూ.60 లక్షలు) అందజేసిన BJP MP కొండా విశ్వేశ్వర్ రెడ్డి
☛ రేపు HYD నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా వద్ద BRS ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు
☛ ‘గ్రూప్-1’ ఫలితాలు రద్దు చేయాలన్న తీర్పుపై హైకోర్టులో మరో అప్పీల్ దాఖలు.. తీర్పును కొట్టివేయాలని ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థి విజ్ఞప్తి.. విచారణకు స్వీకరించిన కోర్టు
News September 23, 2025
విద్యార్థులకు ఆన్‌లైన్ పోటీలు: నిర్మల్ డీఈవో

బతుకమ్మ సంబరాలను పురస్కరించుకొని జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో అన్ని పాఠశాలల విద్యార్థులకు ఆన్‌లైన్‌లో వ్యాసరచన, చిత్రలేఖనం, షార్ట్ ఫిలిమ్స్ పోటీలు నిర్వహించనున్నట్లు డీఈవో భోజన్న తెలిపారు. కాంప్లెక్స్, మండల పరిధిలో పోటీలను తొలుత నిర్వహించాలని సూచించారు. ప్రథమ, ద్వితీయ స్థానంలో నిలిచిన విద్యార్థులను జిల్లా స్థాయిలో నిర్వహించే పోటీలకు పంపుతామన్నారు.