News September 23, 2025

వర్గల్: రేపు సరస్వతి ఆలయానికి ఎమ్మెల్సీ కవిత రాక

image

ప్రసిద్ధ వర్గల్ శ్రీ విద్యా సరస్వతి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బుధవారం క్షేత్రాన్ని సందర్శించనున్నారు. ఈ సందర్భంగా ఆమె అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి వేద పండితులను సత్కరించి ఆశీర్వచనాలు పొందనున్నారు. కాగా దేవి నవరాత్రుల్లో ఎమ్మెల్సీ కవిత రావడం ఇదే మొదటిసారి.

Similar News

News September 23, 2025

కాకినాడ: ప్రభుత్వ ఆసుపత్రిలో 2డి ఎకో సేవలు పునః ప్రారంభం

image

కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో 2డి ఎకో గుండె వైద్య పరీక్షలు మంగళవారం నుంచి తిరిగి ప్రారంభమయ్యాయి. కొంత కాలంగా నిలిచిపోయిన కార్డియాలజీ సేవలను తిరిగి ప్రారంభించేందుకు సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి కృషి చేశారు. ఇన్ సోర్సింగ్ విధానంలో ఈ పరీక్షలు జరుగుతున్నాయని, ఒకే రోజు 30 మందికి 2డి ఎకో పరీక్షలు నిర్వహించామని ఎన్టీఆర్ వైద్య సేవల సమన్వయ అధికారి డాక్టర్ వర ప్రసాద్ తెలిపారు.

News September 23, 2025

బతుకమ్మకు అన్ని ఏర్పాట్లు చేయాలి: ఇన్‌ఛార్జి కలెక్టర్

image

బతుకమ్మ పండగను ఘనంగా నిర్వహించాలని జనగామ జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్ పింకేష్ కుమార్ అధికారులకు ఆదేశించారు. చెరువుల వద్ద భద్రత, పరిశుభ్రత, లైటింగ్, వైద్య శిబిరాలు, అంబులెన్సులు, మహిళల రక్షణకు చర్యలు చేపట్టాలని సూచించారు. పట్టణాల్లో బతుకమ్మ మోడల్స్, గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలు, పౌష్టికాహారం, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు.

News September 23, 2025

మెగా డీఎస్సీ అభ్యర్థులకు కలెక్టర్ ఆదేశాలు

image

మెగా DSCలో ఎంపికైన 1,146 మంది అభ్యర్థులకు ఈనెల 25న అమరావతిలో సీఎం నియామక పత్రాలు అందజేయనున్నట్లు ఏలూరు కలెక్టర్ వెట్రిసెల్వి మంగళవారం తెలిపారు. అభ్యర్థులకు వసతి, భోజనం, రవాణా సౌకర్యాలను పకడ్బందీగా కల్పించాలని అధికారులను ఆదేశించారు. బస్సులకు ప్రత్యేక అధికారులను నియమించాలని సూచించారు. అభ్యర్థులు హాల్ టికెట్, కాల్ లెటర్, ఆధార్, ఫొటో తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలన్నారు.