News September 23, 2025
సిద్దిపేట: ప్రతి ఒక్కరికి క్రమశిక్షణ ముఖ్యం: CP

యూనిఫామ్ వేసుకున్న ప్రతి ఒక్కరికి క్రమశిక్షణ ముఖ్యమని సీపీ అనురాధ అన్నారు. మంగళవారం కమీషనర్ కార్యాలయంలో హోంగార్డ్ సిబ్బందితో క్షేత్రస్థాయిలో సమావేశం నిర్వహించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. హోమ్ గార్డ్స్ పోలీస్ శాఖలో అంతర్భాగమే అని, వారి సంక్షేమానికి ఎల్లవేళలా కృషి చేస్తామని అన్నారు. సివిల్ వివాదాలలో తల దూర్చద్దని సూచించారు. ఏఆర్ అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్రబోస్ తదితరులు ఉన్నారు.
Similar News
News September 23, 2025
వరంగల్ పరిధిలో 17 ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు

వరంగల్ ట్రాఫిక్ పోలీసులు చేపట్టిన తనిఖీల్లో 17 ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు నమోదయ్యాయి. ఆదివారం నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన 16 మందితో పాటు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపిన ఒకరు పట్టుబడినట్లు ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ సుజాత తెలిపారు. వీరందరికీ కోర్టు జరిమానా విధించిందన్నారు. వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News September 23, 2025
తెలంగాణ న్యూస్ రౌండప్

☛ తిరుమల శ్రీవారికి కానుకగా 535 గ్రాముల బంగారు అష్టలక్ష్మీ చంద్రవంక కంఠిని (విలువ రూ.60 లక్షలు) అందజేసిన BJP MP కొండా విశ్వేశ్వర్ రెడ్డి
☛ రేపు HYD నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా వద్ద BRS ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు
☛ ‘గ్రూప్-1’ ఫలితాలు రద్దు చేయాలన్న తీర్పుపై హైకోర్టులో మరో అప్పీల్ దాఖలు.. తీర్పును కొట్టివేయాలని ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థి విజ్ఞప్తి.. విచారణకు స్వీకరించిన కోర్టు
News September 23, 2025
విద్యార్థులకు ఆన్‌లైన్ పోటీలు: నిర్మల్ డీఈవో

బతుకమ్మ సంబరాలను పురస్కరించుకొని జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో అన్ని పాఠశాలల విద్యార్థులకు ఆన్‌లైన్‌లో వ్యాసరచన, చిత్రలేఖనం, షార్ట్ ఫిలిమ్స్ పోటీలు నిర్వహించనున్నట్లు డీఈవో భోజన్న తెలిపారు. కాంప్లెక్స్, మండల పరిధిలో పోటీలను తొలుత నిర్వహించాలని సూచించారు. ప్రథమ, ద్వితీయ స్థానంలో నిలిచిన విద్యార్థులను జిల్లా స్థాయిలో నిర్వహించే పోటీలకు పంపుతామన్నారు.