News April 5, 2024
కోలుకున్న పవన్.. ఎల్లుండి నుంచి ప్రచారం

AP: ఇటీవల జ్వరం బారినపడ్డ జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తిరిగి ఎల్లుండి నుంచి ప్రచారం ప్రారంభించనున్నారు. ఈనెల 7న అనకాపల్లిలో, 8న ఎలమంచిలిలో నిర్వహించే సభల్లో పాల్గొంటారని జనసేన తెలిపింది. 9న పిఠాపురంలో నియోజకవర్గంలో జరిగే ఉగాది వేడుకల్లో పాల్గొంటారని పేర్కొంది. నెల్లిమర్ల, విశాఖ దక్షిణ, పెందుర్తి నియోజకవర్గాల్లో పర్యటన వివరాలను త్వరలో ఖరారు చేయనున్నట్లు వెల్లడించింది.
Similar News
News April 23, 2025
స్పా సెంటర్‌పై పోలీసుల దాడి.. విజయవాడకు చెందిన ఇద్దరు అరెస్ట్

వ్యభిచారం జరుగుతుందన్న సమాచారంతో రాజమండ్రిలోని ఓ స్పా సెంటర్‌పై అక్కడి పోలీసులు మంగళవారం దాడి చేశారు. సీఐ మురళీకృష్ణ తెలిపిన సమాచారం ప్రకారం.. విజయవాడకు చెందిన మదన్, తేజస్విలు అన్నా చెల్లెలు. వీరు విజయవాడ నుంచి వెళ్లి రాజమండ్రిలో స్పా సెంటర్ నిర్వహిస్తున్నారు. బ్యూటీషియన్ కోర్సు నేర్పిస్తామని యువతులకు ఎరవేసి వ్యభిచారం చేయిస్తున్నట్లు గుర్తించారు. ఐదుగురు యువతులు, విటులను పట్టుకున్నారు.
News April 23, 2025
టెర్రర్ అటాక్.. ప్రధాని మోదీ కీలక సమావేశం

జమ్మూ కశ్మీర్‌లోని పహల్‌గామ్‌లో జరిగిన ఉగ్రదాడి ఘటనపై ప్రధాని మోదీ సమావేశం నిర్వహించారు. ఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేంద్ర మంత్రి జై శంకర్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్, విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ ఈ భేటీలో పాల్గొన్నారు. నిన్న జరిగిన టెర్రర్ అటాక్‌లో 30 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
News April 23, 2025
ఇందిరమ్మ ఇళ్లు.. ప్రతి సోమవారం అకౌంట్లోకి డబ్బులు: పొంగులేటి

TG: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం 400 చ.అ.లకు తగ్గకుండా, 600 చ.అ.లకు మించకుండా ఉంటే బిల్లులు విడుదల చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ కలెక్టర్లను ఆదేశించారు. లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణాన్ని బట్టి ప్రతి సోమవారం ఖాతాల్లో డబ్బులు జమ చేయాలన్నారు. ఇళ్ల లబ్ధిదారుల ఎంపికను వేగవంతం చేయాలని సూచించారు. 200 దరఖాస్తులకు ఒక గెజిటెడ్ అధికారిని నియమించాలని, అనర్హులను ఎంపిక చేస్తే ఆయనే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు.