News September 23, 2025
GDK: ‘కార్మికులకు అన్యాయం జరిగింది’

సింగరేణి లాభాల వాటా కంపెనీలో కార్మికులకు అన్యాయం జరిగిందని గుర్తింపు కార్మిక సంఘం(AITUC) అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య అన్నారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. CM రేవంత్ రెడ్డి ఏకపక్షంగా ప్రకటించారని అన్నారు. వాస్తవ లాభాలలో కార్మికులకు వాటా ఇవ్వాల్సి ఉండేదన్నారు. కార్మిక సంఘాల నాయకులకు ఎలాంటి సమాచారం లేకుండా ప్రకటించడం సరైన విధానం కాదన్నారు.
Similar News
News September 23, 2025
వనపర్తి: పెట్రోల్ బంకుల్లో కనీస సౌకర్యాలు కల్పించండి

పెట్రోల్ బంకుల్లో కనీస సౌకర్యాలు కల్పించాలని వనపర్తి జిల్లా అదనపు కలెక్టర్ కీమ్యా నాయక్ అన్నారు. మంగళవారం తన చాంబర్లో పెట్రోల్, డీజిల్ బంకుల యాజమాన్యాలతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. వినియోగదారుల సౌకర్యార్థం పెట్రోల్ బంకులను రాత్రి 11 గంటల వరకు అందుబాటులో ఉంచాలన్నారు. వాహనాల గాలి నింపు యంత్రాలను, ఉచిత మరుగుదొడ్లను అందుబాటులో ఉంచాలన్నారు.
News September 23, 2025
బొండపల్లి: పిడుగుపాటుతో వ్యక్తి మృతి

బొండపల్లి మండలంలో పిడుగుపాటుతో వ్యక్తి మృతి చెందాడు. MRO రాజేశ్వరరావు వివరాల ప్రకారం.. గంట్యాడ మండలం పెదమజ్జిపాలేనికి చెందిన సుంకరి సూర్యనారాయణ (63) వెదురువాడ గ్రామానికి సమీపంలోని మామిడి తోటలో పశువులను మేతకు తీసుకెళ్లాడు. ఒక్కసారిగా పిడుగు పడడంతో సూర్యనారాయణ అక్కడిక్కడే మృతి చెందాడు. వీఆర్వో ద్వారా బొండపల్లి పోలీస్ స్టేషన్లో మంగళవారం ఫిర్యాదు చేశారు.
News September 23, 2025
హైడ్రా యాక్షన్.. ఎలా అయిందో చూడండి.!

గాజులరామారంలో హైడ్రా యాక్షన్‌పై అందరూ అభినందనలు తెలుపుతున్నారు. రూ.15 కోట్ల విలువైన 317 ఎకరాల స్థలాన్ని హైడ్రా కాపాడినట్లు తెలిపింది. వందల సంఖ్యలో అక్రమ నిర్మాణాలు కూల్చివేసినట్లు వెల్లడించింది. హైడ్రా చర్యలను ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ప్రస్తుతం ఎక్కడికక్కడికి నేల కనిపిస్తోందని చెప్పారు.