News September 23, 2025
పిజ్జా తింటున్నారా? ఇవి చూడండి

ఫుడ్ సేఫ్టీ అధికారులు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 55 పిజ్జా రెస్టారెంట్లను ఒకేసారి తనిఖీ చేశారు. కిచెన్‌లలో ఎక్స్‌పైర్ అయిన వస్తువులు, నల్లటి పిజ్జా పెనం, ఇంజిన్ ఆయిల్ లాంటి నూనె, ఎక్కడ చూసినా అపరిశుభ్రంగా ఉండటాన్ని గుర్తించారు. పలు శాంపిల్స్ సేకరించారు. వెంటనే లోపాలను సరిదిద్దుకోవాలని, పరిశుభ్రతను మెయింటేన్ చేయాలని ఆదేశించారు. తనిఖీ చేసిన వాటిలో పిజ్జాహట్, డొమినోస్ వంటి సంస్థలూ ఉన్నాయి.
Similar News
News September 23, 2025
ఇంద్రకీలాద్రిపై కోరినన్ని లడ్డూలు: కలెక్టర్

AP: దసరా ఉత్సవాలకు విజయవాడ దుర్గగుడిలో అన్ని ఏర్పాట్లు చేశామని కలెక్టర్ లక్ష్మీశ పేర్కొన్నారు. ప్రసాద తయారీ కేంద్రాలను తనిఖీ చేశారు. ‘భక్తులు కోరినన్ని లడ్డూలను ప్రసాదంగా అందించేందుకు ఏర్పాట్లు చేశాం. 11 రోజులకు 36 లక్షల లడ్డూలు సిద్ధం చేశాం. రైల్వేస్టేషన్, బస్టాండ్ వంటి ప్రాంతాల్లో విక్రయ కేంద్రాలున్నాయి. మూలా నక్షత్రం రోజున ఉచితంగా ప్రసాదం పంపిణీ చేస్తాం’ అని తెలిపారు.
News September 23, 2025
హైకోర్టును ఆశ్రయించిన స్మితా సబర్వాల్

TG: ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ హైకోర్టును ఆశ్రయించారు. ‘కాళేశ్వరం’ ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలపై పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్టులో తన పేరును తొలగించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. బీఆర్ఎస్ హయాంలో ఆమె సీఎంవో సెక్రటరీగా, నీటిపారుదల శాఖ ఇన్‌ఛార్జి కార్యదర్శిగా పనిచేశారు. గత ఏడాది పీసీ ఘోష్ కమిషన్ ఎదుట విచారణకు కూడా హాజరయ్యారు. ప్రస్తుతం అనారోగ్యం కారణంగా దీర్ఘకాలిక సెలవులో ఉన్నారు.
News September 23, 2025
విద్యార్థినులకు రూ.30వేల స్కాలర్‌షిప్

దేశంలోని బాలికల విద్య కోసం అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ అందిస్తోన్న స్కాలర్‌షిప్స్‌ను సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ ఉన్నత విద్యామండలి సూచించింది. 15,000 మంది బాలికలకు డిగ్రీ పూర్తయ్యే వరకు ప్రతి ఏడాది రూ.30వేలు అందిస్తారు. ప్రభుత్వ స్కూళ్లు/కాలేజీల్లో 10, 12వ తరగతి పాస్ కావాలి. 2025-26 విద్యా సంవత్సరంలో డిప్లొమా, డిగ్రీ, ఇంజినీరింగ్/MBBS ఫస్టియర్‌లో అడ్మిషన్ పొందాలి. దరఖాస్తుతో పాటు పూర్తి వివరాలకు <