News September 23, 2025

కరీంనగర్: బందూకు పట్టిన బడిపంతులు

image

విద్యాబోధనతో భావి తరాలకు వెలుగులు నింపాల్సిన చేతులు తుపాకీ పట్టి, విప్లవ పోరాటంలో కనుమరుగయ్యాయి. ఉమ్మడి KNR(D) కోహెడ(M) తీగలకుంటపల్లికి చెందిన కట్టా రామచంద్రారెడ్డి.. ఒకప్పుడు భూపాలపల్లి, సిద్దిపేట జిల్లాల్లో ఉపాధ్యాయుడిగా పనిచేశారు. 1989లో విప్లవోద్యమానికి ఆకర్షితులై, భార్యతో కలిసి పీపుల్స్ వార్‌లో చేరారు. ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌లో సోమవారం రామచంద్రారెడ్డి మృతిచెందిన విషయం తెలిసిందే.

Similar News

News September 23, 2025

VKB: ‘పత్తి కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి’

image

వికారాబాద్ జిల్లాలో పత్తి కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకొని గిట్టుబాటు ధరలు పొందాలని అదనం కలెక్టర్ లింగ్యా నాయక్ తెలిపారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్‌లో పత్తి కొనుగోళ్లపై అధికారులు, ట్రేడర్లతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో 14 జిన్నింగ్ మిల్లుల నుంచి CCI ద్వారా పత్తి కొనుగోలు జరుగుతుందని చెప్పారు. క్వింటాలుకు గ్రేడ్ 1కు రూ.8,110, గ్రేడ్ 2కు రూ.7,110 ధర నిర్ణయించినట్లు వెల్లడించారు.

News September 23, 2025

VZM: ఆర్టీసీలో అప్రెంటీస్‌ షిప్‌కు దరఖాస్తుల ఆహ్వానం

image

విజయనగరం జిల్లా పరిధిలో గల డిపోలు, యూనిట్‌లలో షీట్ మెటల్ వర్కర్ & పెయింటర్ ట్రేడ్‌లలో అప్రెంటిషిప్ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి జి.వరలక్ష్మి తెలిపారు. www.apprenticeship.gov.in వెబ్‌సైట్ ద్వారా పేర్లు నమోదు చేసుకోవాలన్నారు.

News September 23, 2025

NMMS స్కాలర్షిప్ రిజిస్ట్రేషన్ గడువు పెంపు: DEO

image

నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్‌నకు ఎంపికైన విద్యార్థుల సౌకర్యార్థం రిజిస్ట్రేషన్ గడువును ఈ నెల 30 వరకు పొడిగించినట్లు DEO వెంకటలక్షమ్మ మంగళవారం ప్రకటించారు. 2021, 2022, 2023లో ఎంపికైన విద్యార్థులు https://scholarships.gov.in పోర్టల్‌లో రెన్యువల్ చేసుకోవాలన్నారు. రిజిస్ట్రేషన్ కాకపోతే స్కాలర్షిప్ జమ కాదని తెలిపారు.