News September 23, 2025
NZB: అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలి: MP

ప్రజలకు ఉపయుక్తంగా నిలిచే అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేసేందుకు అధికారులు చొరవ చూపాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించిన దిశ సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్న నిధులతో జిల్లాలో అమలవుతున్న వివిధ పథకాల వివరాలను పూర్తి స్థాయి గణాంకాలతో పక్కాగా అందించాలని అధికారులను ఆదేశించారు.
Similar News
News September 23, 2025
నిజామాబాద్‌లో కలెక్టర్‌ను కలిసిన మీసేవ నిర్వాహకులు

నిజామాబాద్ జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డిని జిల్లా మీసేవ (ఏఎంసీఓఏ) అసోసియేషన్ సభ్యులు మంగళవారం కలిశారు. నిజాయితీగా పనిచేస్తున్న తమపై కొందరు మధ్యవర్తులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే మీసేవ నిర్వాహకులు ఎదుర్కొంటున్న సమస్యలపై కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మీసేవ టీమ్ సభ్యులు పాల్గొన్నారు.
News September 23, 2025
నిజామాబాద్‌లో భారీ చోరీ

నిజామాబాద్ నగరంలో భారీ చోరీ జరిగింది. సుమారు 30 తులాల బంగారు ఆభరణాలు అపహరణకు గురైనట్లు బాధితులు తెలిపారు. నాగారంలోని బ్రాహ్మణ కాలనీలో నివాసం ఉండే పవన్ శర్మ సోమవారం రాత్రి ఇంటికి తాళం వేసి పూజకు వెళ్లారు. గుర్తు తెలియని దుండగులు వచ్చి తాళం పగల గొట్టి ఇంట్లోకి చొరబడి లాకర్‌ను ధ్వసం చేసి అందులోని 30 తులాల బంగారు ఆభరణాలు అపహరించారు. 5వ టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.
News September 23, 2025
శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్‌కు 3,01,321 క్యూసెక్కుల

SRSP నుంచి 3,01,321 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 40 వరద గేట్ల ద్వారా నీటిని గోదావరిలోకి వదులుతున్నట్లు అధికారులు చెప్పారు. ఎగువ ప్రాంతాల నుంచి 1,52,225 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులో వచ్చి చేరుతున్నట్లు పేర్కొన్నారు. ప్రాజెక్టులో ప్రస్తుతం 72.23 TMCల నీరు నిల్వ ఉంది.