News September 23, 2025
ఇన్‌కమ్ ట్యాక్స్ చెల్లించింది ఎందరో తెలుసా?

దేశంలో 142.21 కోట్ల జనాభా ఉంటే అందులో 3.51 కోట్ల మందే FY2024-25లో ఆదాయ పన్ను చెల్లించినట్లు ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. 51.69కోట్ల మంది పాన్ & ఆధార్ లింక్ చేశారని, అందులో 7.20 కోట్ల మంది ITR దాఖలు చేసినట్లు ట్వీట్స్ చేస్తున్నారు. కేవలం 4శాతం మంది మాత్రమే పన్ను చెల్లిస్తున్నారని పేర్కొంటున్నారు. అయితే అభివృద్ధి చెందిన దేశాల్లో 50% మంది పన్ను చెల్లిస్తారని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News September 23, 2025
ఈ ఫొటోలోని సెన్సేషనల్ డైరెక్టర్‌ని గుర్తు పట్టారా?

పై ఫొటోలో ఓ దిగ్గజ దర్శకుడు ఉన్నారు. డైరెక్టర్లు హీరోలను పరిచయం చేస్తే.. ఈయన టాలీవుడ్‌కు డైనమిక్ డైరెక్టర్లను అందించారు. యువ దర్శకులకు ఆయన మూవీ ఓ ప్రయోగశాల వంటిది. విజయాల నుంచి వివాదాల వరకు అన్నింటా ఆయనదే పైచేయి. ఆ సెన్సేషనల్ డైరెక్టరెవరో గుర్తుపట్టారా?
COMMENT.
News September 23, 2025
₹3,745 కోట్ల పెట్టుబడులు.. 1,518 ఉద్యోగాలు

TG: రాష్ట్రంలో కోకా కోలా, JSW, తోషిబా కంపెనీల ₹3,745 కోట్ల విలువైన పెట్టుబడులకు క్యాబినెట్ సబ్ కమిటీ ఆమోదం తెలిపింది. వీటి ద్వారా 1,518 ఉద్యోగాలు వస్తాయని పేర్కొంది. కోకా కోలా ₹2,398Cr (600 ఉద్యోగాలు), JSW UAV కొత్త యూనిట్ ₹785Cr (364 జాబ్స్), తోషిబా ₹562Cr (554 జాబ్స్) పెట్టుబడులు పెట్టనున్నాయి. కోకా కోలా వంటి కంపెనీల ఏర్పాటుతో మామిడి, నారింజ రైతులకు ప్రోత్సాహం లభిస్తుందని Dy.CM భట్టి అన్నారు.
News September 23, 2025
PCB అనలిస్ట్ నియామక ఫలితాలు విడుదల

AP: పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో గ్రేడ్-2 అనలిస్ట్ పరీక్ష ఫలితాలను <