News September 23, 2025

వన్డేల్లో కోహ్లీ ఆడతారా? ఆడరా?

image

భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ వన్డేల్లో కొనసాగడంపై అనుమానాలు నెలకొన్నాయి. వచ్చే నెలలో AUSతో వన్డే సిరీస్‌కు ముందు AUS-Aతో ODI సిరీస్‌లో ఆడాలని రోహిత్, కోహ్లీకి BCCI సూచించినట్లు క్రీడా వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే రోహిత్ ప్రాక్టీస్ మొదలెట్టగా, BCCIకి కోహ్లీ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదని సమాచారం. దీంతో ఆయన ఆడటంపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం విరాట్ తన ఫ్యామిలీతో లండన్‌లో ఉంటున్నారు.

Similar News

News September 23, 2025

₹3,745 కోట్ల పెట్టుబడులు.. 1,518 ఉద్యోగాలు

image

TG: రాష్ట్రంలో కోకా కోలా, JSW, తోషిబా కంపెనీల ₹3,745 కోట్ల విలువైన పెట్టుబడులకు క్యాబినెట్ సబ్ కమిటీ ఆమోదం తెలిపింది. వీటి ద్వారా 1,518 ఉద్యోగాలు వస్తాయని పేర్కొంది. కోకా కోలా ₹2,398Cr (600 ఉద్యోగాలు), JSW UAV కొత్త యూనిట్ ₹785Cr (364 జాబ్స్), తోషిబా ₹562Cr (554 జాబ్స్) పెట్టుబడులు పెట్టనున్నాయి. కోకా కోలా వంటి కంపెనీల ఏర్పాటుతో మామిడి, నారింజ రైతులకు ప్రోత్సాహం లభిస్తుందని Dy.CM భట్టి అన్నారు.

News September 23, 2025

PCB అనలిస్ట్ నియామక ఫలితాలు విడుదల

image

AP: పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో గ్రేడ్-2 అనలిస్ట్ పరీక్ష ఫలితాలను <>APPSC<<>> విడుదల చేసింది. పోస్టులకు ఎంపికైన వారి ప్రొవిజినల్ జాబితాను వెబ్సైట్లో పొందుపర్చినట్లు తెలిపింది. కాగా ఎంపికైన వారందరూ ఉద్యోగం సాధించినట్లు కాదని, అభ్యర్థుల క్యారెక్టర్, పూర్వాపరాలపై అపాయింటింగ్ అథారిటీ విచారించి నిర్ణయం తీసుకుంటుందని పేర్కొంది. హైకోర్టులో దీనిపై కేసు ఉన్నందున తుది తీర్పు ప్రకారం నియామకాలుంటాయంది.

News September 23, 2025

10 గ్రా. బంగారం ధర రూ.2లక్షలు?.. ‘జెఫరీస్’ అంచనా

image

ప్రపంచ ఆర్థిక అనిశ్చితులతో ఇన్వెస్టర్లు బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా భావిస్తున్నారని, దీంతో ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని ప్రఖ్యాత స్టాక్ బ్రోకరేజ్ సంస్థ ‘జెఫరీస్’ గ్లోబల్ హెడ్ క్రిస్ వుడ్ అంచనా వేశారు. ప్రస్తుతం ఉన్న ధరల నుంచి ఏకంగా 77% మేర పెరగొచ్చని అభిప్రాయపడ్డారు. ఒకవేళ ఇదే నిజమైతే 10గ్రా బంగారం ధర ₹2 లక్షల మార్కును చేరుకోనుంది. అయితే ఎప్పటివరకు గోల్డ్ ఆ మార్క్ అందుకుంటుందో చెప్పలేదు.