News September 23, 2025

ఈ సీజన్‌లో రూ.లక్ష కోట్ల బిజినెస్!

image

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈకామర్స్ సైట్లలో ఇవాళ్టి నుంచి భారీ ఆఫర్లు మొదలయ్యాయి. దీంతో ఇండియాలోని ఈ సంస్థల ఆఫీసులు వార్ రూములను తలపిస్తున్నాయి. ఈ సీజన్‌లో ఏకంగా 25లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. 1.2ట్రిలియన్ సేల్స్ జరుగుతాయని టెక్ నిపుణుల అంచనా. మొత్తం రూ.లక్ష కోట్ల రెవెన్యూ జనరేట్ అవుతుందని సమాచారం. అర్ధరాత్రి నుంచే సేల్స్ విపరీతంగా జరుగుతుండటం విశేషం.

Similar News

News September 23, 2025

GREAT: 3 సార్లు H1B రాకపోయినా..

image

బెంగళూరుకు చెందిన తనూశ్ శరణార్థి అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మూడుసార్లు H1B వీసా కోల్పోయినా వెనుకడుగు వేయకుండా ప్రతిష్ఠాత్మక వీసా సాధించారు. ‘నేను వరుసగా 3 సార్లు లాటరీల్లో H1B సాధించలేకపోయాను. దీంతో రాత్రింబవళ్లు కష్టపడి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో పట్టు సాధించా. ఈ వారం 0-1 వీసా అప్రూవ్ అయింది’ అని పేర్కొన్నారు. 0-1 వీసాను Einstein visa అంటారు. ఎక్స్‌ట్రార్డినరీ స్కిల్స్ ఉన్నవారికే ఇది వస్తుంది.

News September 23, 2025

బికినీలో సాయిపల్లవి అని ప్రచారం.. నిజమేనా?

image

సాయి పల్లవి బికినీ ధరించారంటూ కొన్ని ఫొటోలు SMలో వైరలయ్యాయి. ఇవి నిజమని నమ్మిన కొందరు మూవీ ఛాన్సుల కోసం ఆమె మారిపోయారంటూ విమర్శిస్తున్నారు. అయితే అవి నిజమైన ఫొటోలు కాదని తేలింది. ఆమె సోదరి పూజ ఇటీవల స్విమ్ సూట్ ధరించిన ఫొటోలను instaలో పోస్ట్ చేయగా, వాటిని కొందరు బికినీ ధరించినట్లుగా AI సాయంతో మార్ఫింగ్ చేసి పోస్ట్ చేశారు. ఈ విషయం తెలిసి ఫ్యాన్స్ ఆమెకు అండగా నిలుస్తున్నారు.

News September 23, 2025

ఈ ఫొటోలోని సెన్సేషనల్ డైరెక్టర్‌ని గుర్తు పట్టారా?

image

పై ఫొటోలో ఓ దిగ్గజ దర్శకుడు ఉన్నారు. డైరెక్టర్లు హీరోలను పరిచయం చేస్తే.. ఈయన టాలీవుడ్‌కు డైనమిక్ డైరెక్టర్లను అందించారు. యువ దర్శకులకు ఆయన మూవీ ఓ ప్రయోగశాల వంటిది. విజయాల నుంచి వివాదాల వరకు అన్నింటా ఆయనదే పైచేయి. ఆ సెన్సేషనల్ డైరెక్టరెవరో గుర్తుపట్టారా?
COMMENT.