News September 23, 2025
అక్టోబర్ 8 నుంచి TU ఎం.ఎడ్ పరీక్షలు

తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని ఎం.ఎడ్ పరీక్షల షెడ్యూల్‌ను అధికారులు విడుదల చేశారు. రెగ్యులర్ II సెమిస్టర్ థియరీ పరీక్షలు అక్టోబర్ 8 నుంచి 15వరకు జరుగుతాయని పరీక్షల నియంత్రణ అధికారి ప్రొఫెసర్ కే. సంపత్ కుమార్ తెలిపారు. పూర్తి వివరాలను విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు ఆయన పేర్కొన్నారు.
Similar News
News September 23, 2025
పొరుగు సేవల పద్ధతిన పోస్టుల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ

పొరుగు సేవల పద్ధతిన జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయంలో 6 నెలలు వరకు పని చేసేందుకు అర్హత గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే తెలిపారు. 1 పబ్లిసిటీ అసిస్టెంట్ ఫొటోగ్రాఫర్, 1 వీడియో కెమెరామెన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. ఫొటోగ్రాఫర్ పోస్టుకు 10వ తరగతి సమానమైన విద్యార్హత కలిగి ఉండాలన్నారు.
News September 23, 2025
బికినీలో సాయిపల్లవి అని ప్రచారం.. నిజమేనా?

సాయి పల్లవి బికినీ ధరించారంటూ కొన్ని ఫొటోలు SMలో వైరలయ్యాయి. ఇవి నిజమని నమ్మిన కొందరు మూవీ ఛాన్సుల కోసం ఆమె మారిపోయారంటూ విమర్శిస్తున్నారు. అయితే అవి నిజమైన ఫొటోలు కాదని తేలింది. ఆమె సోదరి పూజ ఇటీవల స్విమ్ సూట్ ధరించిన ఫొటోలను instaలో పోస్ట్ చేయగా, వాటిని కొందరు బికినీ ధరించినట్లుగా AI సాయంతో మార్ఫింగ్ చేసి పోస్ట్ చేశారు. ఈ విషయం తెలిసి ఫ్యాన్స్ ఆమెకు అండగా నిలుస్తున్నారు.
News September 23, 2025
‘కరీంనగర్‌లో ఆయుర్వేద సేవలు అందిపుచ్చుకోవాలి’

కరీంనగర్‌లో ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా నేడు రామ్‌నగర్‌లోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆయుర్వేద ఔషధాలు, యోగాసనాలను పరిశీలించి, ఉచిత సేవల వివరాలను రోగులకు తెలియజేయాలని ఆదేశించారు. గర్భిణీలకు యోగాసనాల అవగాహన, ఆస్పత్రి ఆవరణలో స్వచ్ఛత, మొక్కల నాటడం చేయాలన్నారు.