News September 23, 2025
WNP: దసరా పండుగకు ఊరెళ్లేవారు జాగ్రత్తలు పాటించాలి

దసరా పండుగ సందర్భంగా ఊరికి వెళ్లేవారు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని వనపర్తి జిల్లా ఎస్పీ గిరిధర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పండగల కోసం కుటుంబంతో సహా తమ స్వగ్రామాలకు వెళ్లేవారు ఇరుగుపొరుగు వారికి సమాచారం ఇచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చి వెళ్లాలన్నారు. విలువైన వస్తువులు ఇంట్లో పెట్టకుండా బ్యాంకు లాకర్లో లేదా తమ వెంట తీసుకెళ్లడం మంచిదని అన్నారు.
Similar News
News September 23, 2025
బికినీలో సాయిపల్లవి అని ప్రచారం.. నిజమేనా?

సాయి పల్లవి బికినీ ధరించారంటూ కొన్ని ఫొటోలు SMలో వైరలయ్యాయి. ఇవి నిజమని నమ్మిన కొందరు మూవీ ఛాన్సుల కోసం ఆమె మారిపోయారంటూ విమర్శిస్తున్నారు. అయితే అవి నిజమైన ఫొటోలు కాదని తేలింది. ఆమె సోదరి పూజ ఇటీవల స్విమ్ సూట్ ధరించిన ఫొటోలను instaలో పోస్ట్ చేయగా, వాటిని కొందరు బికినీ ధరించినట్లుగా AI సాయంతో మార్ఫింగ్ చేసి పోస్ట్ చేశారు. ఈ విషయం తెలిసి ఫ్యాన్స్ ఆమెకు అండగా నిలుస్తున్నారు.
News September 23, 2025
‘కరీంనగర్‌లో ఆయుర్వేద సేవలు అందిపుచ్చుకోవాలి’

కరీంనగర్‌లో ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా నేడు రామ్‌నగర్‌లోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆయుర్వేద ఔషధాలు, యోగాసనాలను పరిశీలించి, ఉచిత సేవల వివరాలను రోగులకు తెలియజేయాలని ఆదేశించారు. గర్భిణీలకు యోగాసనాల అవగాహన, ఆస్పత్రి ఆవరణలో స్వచ్ఛత, మొక్కల నాటడం చేయాలన్నారు.
News September 23, 2025
సీతంపేట: ‘రహదారుల నిర్మాణంలో డోలి గ్రామాలకే తొలి ప్రాధాన్యత’

ఐటీడీఏ ద్వారా చేపడుతున్న రహదారి నిర్మాణంలో డోలి గ్రామాలకే తొలి ప్రాధాన్యత ఇవ్వాలని పార్వతీపురం కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి అన్నారు. మంగళవారం సీతంపేట ఐటీడీఏ కార్యాలయంలో ఐటీడీఏ సిబ్బందితో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. గిరిజన గ్రామాల్లో పదో తరగతి పాస్ అయిన విద్యార్థులను కచ్చితంగా ఇంటర్మీడియట్ కళాశాలలో చేర్పించాలని సూచించారు. వసతి గృహాలలో మెనూ సక్రమంగా అమలు చేయాలన్నారు.