News September 23, 2025
శ్రీవారి సేవకులకు శుభవార్త

AP: తిరుమల శ్రీవారి సేవకులకు TTD ఛైర్మన్ బీఆర్ నాయుడు శుభవార్త చెప్పారు. సేవా కాలం ముగిసిన అనంతరం వారికి మెరుగైన స్వామివారి దర్శనానికి ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. త్వరలోనే ఈ విషయంపై బోర్డు సమావేశంలో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల భక్తులు శ్రీవారి సేవ చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారని తెలిపారు. శ్రీవారి సేవకులు భగవద్బంధువులు అని పేర్కొన్నారు.
Similar News
News September 23, 2025
GREAT: 3 సార్లు H1B రాకపోయినా..

బెంగళూరుకు చెందిన తనూశ్ శరణార్థి అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మూడుసార్లు H1B వీసా కోల్పోయినా వెనుకడుగు వేయకుండా ప్రతిష్ఠాత్మక వీసా సాధించారు. ‘నేను వరుసగా 3 సార్లు లాటరీల్లో H1B సాధించలేకపోయాను. దీంతో రాత్రింబవళ్లు కష్టపడి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో పట్టు సాధించా. ఈ వారం 0-1 వీసా అప్రూవ్ అయింది’ అని పేర్కొన్నారు. 0-1 వీసాను Einstein visa అంటారు. ఎక్స్‌ట్రార్డినరీ స్కిల్స్ ఉన్నవారికే ఇది వస్తుంది.
News September 23, 2025
బికినీలో సాయిపల్లవి అని ప్రచారం.. నిజమేనా?

సాయి పల్లవి బికినీ ధరించారంటూ కొన్ని ఫొటోలు SMలో వైరలయ్యాయి. ఇవి నిజమని నమ్మిన కొందరు మూవీ ఛాన్సుల కోసం ఆమె మారిపోయారంటూ విమర్శిస్తున్నారు. అయితే అవి నిజమైన ఫొటోలు కాదని తేలింది. ఆమె సోదరి పూజ ఇటీవల స్విమ్ సూట్ ధరించిన ఫొటోలను instaలో పోస్ట్ చేయగా, వాటిని కొందరు బికినీ ధరించినట్లుగా AI సాయంతో మార్ఫింగ్ చేసి పోస్ట్ చేశారు. ఈ విషయం తెలిసి ఫ్యాన్స్ ఆమెకు అండగా నిలుస్తున్నారు.
News September 23, 2025
ఈ ఫొటోలోని సెన్సేషనల్ డైరెక్టర్‌ని గుర్తు పట్టారా?

పై ఫొటోలో ఓ దిగ్గజ దర్శకుడు ఉన్నారు. డైరెక్టర్లు హీరోలను పరిచయం చేస్తే.. ఈయన టాలీవుడ్‌కు డైనమిక్ డైరెక్టర్లను అందించారు. యువ దర్శకులకు ఆయన మూవీ ఓ ప్రయోగశాల వంటిది. విజయాల నుంచి వివాదాల వరకు అన్నింటా ఆయనదే పైచేయి. ఆ సెన్సేషనల్ డైరెక్టరెవరో గుర్తుపట్టారా?
COMMENT.