News April 5, 2024

వెజ్ ప్లేట్ భోజనం ధర పెరిగింది

image

శాకాహార భోజనం ప్లేటుకు అయ్యే ఖర్చు 7% పెరిగి రూ.27.3కు చేరిందని ప్రముఖ రేటింగ్ సంస్థ క్రిసిల్ తెలిపింది. గతేడాది ఇదే సమయంలో రూ.25.5గా ఉందని పేర్కొంది. నిత్యావసర సరకుల ధరలు పెరగడమే దీనికి కారణమని వెల్లడించింది. ఇక మాంసాహార భోజనం ప్లేట్ ధర 7% తగ్గి రూ.59.2 నుంచి రూ.54.9కి చేరినట్లు వివరించింది. ఉల్లిపాయలు 46%, టమాటాలు 36%, ఆలుగడ్డ 22%, పప్పులు 22%, బియ్యం ధరలు 14% పెరిగినట్లు క్రిసిల్ పేర్కొంది.

Similar News

News September 15, 2025

తల్లి కాబోతున్న కత్రినా కైఫ్!

image

బాలీవుడ్ స్టార్ కపుల్ కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ తల్లిదండ్రులు కాబోతున్నట్లు సమాచారం. కత్రినా ప్రస్తుతం ప్రెగ్నెంట్ అని, ఈ ఏడాది అక్టోబర్/నవంబర్‌లో బిడ్డకు జన్మనివ్వనున్నట్లు NDTV పేర్కొంది. లాంగ్ మెటర్నిటీ బ్రేక్‌లో ఉన్నారని రాసుకొచ్చింది. కత్రినా చివరిగా విజయ్ సేతుపతితో ‘మేరీ క్రిస్మస్’ మూవీలో నటించారు. కాగా 2021లో విక్కీ, కత్రినా రాజస్థాన్‌లో వివాహం చేసుకున్నారు.

News September 15, 2025

దూబే ఉంటే టీమ్ ఇండియాకు ఓటమి దూరం!

image

టీమ్ ఇండియా క్రికెటర్ శివమ్ దూబే అరుదైన రికార్డు నెలకొల్పారు. వరుసగా 31 టీ20 మ్యాచుల్లో ఓటమెరుగని క్రికెటర్‌గా నిలిచారు. ఆయన ఆడిన గత 31 మ్యాచుల్లో టీమ్ ఇండియా ఒక్క మ్యాచులోనూ ఓడిపోలేదు. ఆసియా కప్‌లో భాగంగా పాక్‌తో నిన్న జరిగిన మ్యాచులోనూ ఈ పరంపర కొనసాగింది. 2020లో న్యూజిలాండ్ సిరీస్ నుంచి ఈ జైత్రయాత్ర కొనసాగుతోంది. 31 మ్యాచుల్లో 25 గెలవగా నాలుగు టై అయ్యాయి. రెండింట్లో ఫలితం తేలలేదు.

News September 15, 2025

రేపు భారీ వర్షాలు

image

ఏపీలోని కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో రేపు పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నెల్లూరు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వానలు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. కాగా ఇవాళ తూ.గో., ప.గో., కాకినాడ, కోనసీమ జిల్లాల్లో వర్షాలు కురిశాయి.