News September 23, 2025
చూడముచ్చటైన బతుకమ్మ కుంట.. 25న ప్రారంభోత్సవం

అంబర్ పేటలోని బతుకమ్మ కుంటను ప్రభుత్వం చూడ ముచ్చటగా ముస్తాబు చేసింది. దాదాపు రూ.7.40 కోట్లు ఖర్చుపెట్టి చెరువును సుందరంగా తీర్చిదిద్దింది. దాదాపు 5 ఎకరాల్లో విస్తరించి ఉన్న చెరువులో వ్యర్థాలను మొత్తం తొలగించారు. ఈనెల 25న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
Similar News
News September 23, 2025
HYD: పిజ్జా ఔట్‌లెట్లపై అధికారుల దాడులు

రాష్ట్రవ్యాప్తంగా 55 పిజ్జా ఔట్‌లెట్స్‌పై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. ఇందులో 18 పిజ్జాహట్, 16 డొమినోస్, 21 ఇతర కేంద్రాలు ఉన్నాయి. తనిఖీల్లో కిచెన్లలో అపరిశుభ్రత, వెజ్, నాన్‌వెజ్ వస్తువులను ఒకేచోట నిల్వ ఉంచడం వంటి నిబంధనలు ఉల్లంఘించినట్లు అధికారులు గుర్తించారు. ఫుడ్ శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపారు.
News September 23, 2025
నార్సింగిలో ప్రేమ జంటపై దుండగుల దాడి

నార్సింగి పరిధిలో దొంగలు రెచ్చిపోయారు. ఆదివారం రాత్రి కోకాపేట్ నియోపోలిస్ వద్ద ఒంటరిగా ఉన్న ఓ ప్రేమ జంటపై ఆరుగురు దుండగులు దాడికి పాల్పడ్డారు. వాళ్లను బెదిరించి బంగారు గొలుసు, మొబైల్, నగదు లాక్కొని బైక్స్‌పై పరారయ్యారు. ఈమేరకు బాధితుల ఫిర్యాదుతో నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు. స్థానికంగా ఉన్న సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.
News September 23, 2025
HYD:’వరద భయం లేని నగరమే హైడ్రా లక్ష్యం’

HYD నగరాన్ని వరదల నుంచి కాపాడడం, ప్రజలు ఏలాంటి భయం లేకుండా జీవించేలా చేయడం హైడ్రా ప్రధాన లక్ష్యం అని కమిషనర్ రంగనాథ్ అన్నారు. వర్షాకాలంలో కొద్దిపాటి వర్షానికే నీట మునిగే పరిస్థితులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపడుతోంది. డ్రైనేజీ వ్యవస్థను బలోపేతం చేయడం, కొత్త నాలాలు, కాల్వలు నిర్మించడం, చెరువులను శుభ్రపరచడం, వర్షపు నీరు నిల్వ లేకుండా చర్యలు అమలు చేస్తోందన్నారు.