News September 23, 2025

పోలాకి: పిడుగుపడి మహిళ మృతి

image

పోలాకి మండలం ఉర్జాం గ్రామానికి చెందిన కణితి పద్మావతి (55) మంగళవారం పిడుగుపాటుకు గురై మృతి చెందారు. పొలంలో గాబు తీస్తున్న సమయంలో సమీపంలో పిడుగు పడడంతో మృతి చెందిందని మృతురాలు భర్త కృష్ణారావు తెలిపారు. మృతురాలికి ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. పద్మావతి మృతితో గ్రామంలో విషాధఛాయలు అలుముకున్నాయి.

Similar News

News September 23, 2025

SKLM: DSCలో ఎంపికైన అభ్యర్థులకు ముఖ్య గమనిక

image

DSC‌లో ఎంపికైన అభ్యర్థులకు 25న విజయవాడలో సీఎం నియామక పత్రాలను అందజేయమన్నారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం డీఈవో రవిబాబు ఓ ప్రకటన విడుదల చేశారు. 24న ఉదయం 6 గంటలకు, శ్రీకాకుళం ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్‌కు అభ్యర్థులు చేరుకోవాలని, 37 ప్రత్యేక బస్సుల్లో విజయవాడు చేరుకుంటారన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన బస్సుల్లో వచ్చిన వారికి మాత్రమే అనుమతి ఉంటుందన్నారు.

News September 23, 2025

కోటబొమ్మాళి: హెలికాప్టర్ రైడ్‌కు ఇంకా ఎన్ని టికెట్లు ఉన్నాయంటే?

image

కోటబొమ్మాళి కొత్తమ్మతల్లి ఉత్సవాల్లో భాగంగా సోమవారానికి హెలికాప్టర్ రైడ్‌ చేసేందుకు 92 టికెట్‌లు అమ్ముడుపోయాయి. ఇంకా 158 టికెట్‌లు అందుబాటులో ఉన్నాయి. నేటి నుంచి 25 వరకు వాతావరణం దృష్టిలో ఉంచుకొని ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 వరకు రైడ్ ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.

News September 23, 2025

ఎచ్చెర్ల: ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో ఆందోళన చెందవద్దు

image

ఫీజు రియంబర్స్మెంట్ పై కళాశాలల యజమానులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని, జిల్లా సాంఘిక సంక్షేమ సంచాలకులు మధుసూదన్ రావు అన్నారు. ఈ మేరకు అనుబంధ కళాశాలల ప్రిన్సిపల్‌తో, ఎచ్చెర్ల‌లోని డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీలో సోమవారం సమావేశం నిర్వహించారు. విద్యార్థులకు విడతల వారిగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు త్వరలో చెల్లింపునకు, రాష్ట్రప్రభుత్వం సన్నాహాలు చేస్తుందన ఆయన పేర్కొన్నారు.