News September 23, 2025
విద్యార్థులకు ఆన్‌లైన్ పోటీలు: నిర్మల్ డీఈవో

బతుకమ్మ సంబరాలను పురస్కరించుకొని జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో అన్ని పాఠశాలల విద్యార్థులకు ఆన్‌లైన్‌లో వ్యాసరచన, చిత్రలేఖనం, షార్ట్ ఫిలిమ్స్ పోటీలు నిర్వహించనున్నట్లు డీఈవో భోజన్న తెలిపారు. కాంప్లెక్స్, మండల పరిధిలో పోటీలను తొలుత నిర్వహించాలని సూచించారు. ప్రథమ, ద్వితీయ స్థానంలో నిలిచిన విద్యార్థులను జిల్లా స్థాయిలో నిర్వహించే పోటీలకు పంపుతామన్నారు.
Similar News
News September 24, 2025
ఆరోగ్య సమస్యలు.. అవసరమైన విటమిన్లు

* అలసటగా ఉంటే విటమిన్ B12, *రోగనిరోధక శక్తి కోసం విటమిన్ C, * జుట్టు పలచబడితే బయోటిన్ (B7), * పొడి చర్మం ఉంటే విటమిన్ E, *తరచుగా జలుబు వస్తుంటే విటమిన్ D, *కండరాల తిమ్మిరి అనిపిస్తే మెగ్నీషియం + విటమిన్ D, *రాత్రి సరిగా కనిపించకపోతే విటమిన్ A, *గాయాలు నెమ్మదిగా మానితే విటమిన్ C + జింక్, *మూడ్ స్వింగ్స్ / ఆందోళనగా ఉంటే విటమిన్ B6 + మెగ్నీషియం, *కీళ్ల దృఢత్వానికి విటమిన్ D + K2. SHARE IT
News September 24, 2025
జగిత్యాల: ఎకానమిక్ సపోర్ట్ స్కీంకు దరఖాస్తుల ఆహ్వానం

JGTL జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 24-25 ఆర్థిక సంవత్సరానికి ఎకానమిక్ సపోర్ట్ స్కీం కింద దరఖాస్తులు ఆహ్వానించనున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి తెలిపారు. ఫకీర్, దూదేకుల, దుర్బల ముస్లిం కమ్యూనిటీ వర్గాల వారు అర్హులన్నారు. రూ.1 లక్ష గల మోపెడ్లు, బైక్‌లు, ఈ-బైక్‌లు లబ్ధిదారులకు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. tgobmms.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా OCT 6 లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
News September 24, 2025
రేపు విజయవాడకు ఉపరాష్ట్రపతి రాక

AP: వైస్ ప్రెసిడెంట్ C.P రాధాకృష్ణన్, ఆయన సతీమణి సుమతి బుధవారం మధ్యాహ్నం విజయవాడకు రానున్నారు. విమానాశ్రయంలో CM చంద్రబాబు వారికి స్వాగతం పలకనున్నారు. అనంతరం ఉపరాష్ట్రపతి దంపతులు కనకదుర్గా అమ్మవారిని దర్శించుకుంటారు. సాయంత్రం జరిగే విజయవాడ ఉత్సవ్‌లో చీఫ్ గెస్టుగా పాల్గొంటారు. అనంతరం IAF ప్రత్యేక విమానంలో తిరుపతికి వెళ్తారు. రోడ్డు మార్గంలో తిరుమలకు చేరుకొని స్వామివారిని దర్శించుకోనున్నారు.