News September 23, 2025
నార్సింగిలో ప్రేమ జంటపై దుండగుల దాడి

నార్సింగి పరిధిలో దొంగలు రెచ్చిపోయారు. ఆదివారం రాత్రి కోకాపేట్ నియోపోలిస్ వద్ద ఒంటరిగా ఉన్న ఓ ప్రేమ జంటపై ఆరుగురు దుండగులు దాడికి పాల్పడ్డారు. వాళ్లను బెదిరించి బంగారు గొలుసు, మొబైల్, నగదు లాక్కొని బైక్స్‌పై పరారయ్యారు. ఈమేరకు బాధితుల ఫిర్యాదుతో నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు. స్థానికంగా ఉన్న సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.
Similar News
News September 24, 2025
HYD: ర్యాగింగ్ భూతం.. ఈనంబర్లు సేవ్ చేసుకోండి

ర్యాగింగ్ భూతానికి ఓ బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం నగరంలో చర్చనీయాంశమైంది. బీటెక్ విద్యార్థి ఇలా ప్రాణం తీసుకోవడం బాధాకరమని, ఇలాంటి ఘటనపై విద్యార్థులు ధైర్యంగా ఫిర్యాదు చేయాలని పోలీసులు కోరుతున్నారు. ట్రై కమిషనరేట్ పరిధిలోని విద్యార్థులు 100, 040-23286966, 8712681251, 040-27853418, 9490617100, 040-27852333, 8712661000, 040-27853030, 8712662666 నంబర్లకు ఫోన్ చేసి సాహాయం పొందవచ్చని సూచించారు.
News September 24, 2025
సైబరాబాద్ కమిషనరేట్‌లో పోలీసులకు మెడల్స్

సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆడిటోరియంలో 122 పోలీస్ సిబ్బందికి సేవా పథకం మెడల్స్ అందజేశారు. ఈ అవార్డుల్లో 35 మెడల్స్ కొత్త సంవత్సరం, 87 మెడల్స్ తెలంగాణ స్థాపన దినోత్సవం సందర్భంగా ఇచ్చారు. సైబరాబాద్ CP అవినాష్ మోహంతి అవార్డులను అందజేసి అభినందించారు. ఈ అవార్డులు సిబ్బందికి కృషి, ప్రజా భద్రతలో అంకితభావాన్ని ప్రతిబింబిస్తాయని చెప్పారు. జాయింట్ CP ట్రాఫిక్, ADCPs, ACPs, ఇన్స్పెక్టర్లు ఉన్నారు.
News September 23, 2025
HYD: పిజ్జా ఔట్‌లెట్లపై అధికారుల దాడులు

రాష్ట్రవ్యాప్తంగా 55 పిజ్జా ఔట్‌లెట్స్‌పై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. ఇందులో 18 పిజ్జాహట్, 16 డొమినోస్, 21 ఇతర కేంద్రాలు ఉన్నాయి. తనిఖీల్లో కిచెన్లలో అపరిశుభ్రత, వెజ్, నాన్‌వెజ్ వస్తువులను ఒకేచోట నిల్వ ఉంచడం వంటి నిబంధనలు ఉల్లంఘించినట్లు అధికారులు గుర్తించారు. ఫుడ్ శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపారు.