News September 23, 2025

పత్తి కొనుగోలు పారదర్శకంగా జరగాలి: కలెక్టర్

image

పత్తి కొనుగోళ్లు పూర్తి పారదర్శకంగా జరగాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అధికారులను ఆదేశించారు. మంగళవారం పాల్వంచ కలెక్టర్ కార్యాలయంలో వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖ అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని, ప్రభుత్వం నిర్ణయించిన ధర రైతులకు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

Similar News

News September 24, 2025

ఉట్నూర్: ఆర్టీసీలో ఉద్యోగాలు

image

రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో డ్రైవర్స్, శ్రామిక్ పోస్టుల భర్తీ కోసం స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ నోటిఫికేషన్ విడుదల చెసిందని, అర్హులైన గిరిజనులు దరఖాస్తు చేసుకోవాలని ఉట్నూర్ ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఖుష్భూగుప్తా తెలిపారు. ఉమ్మడి ADBజిల్లాలోని అర్హులైన గిరిజన యువత మరిన్ని వివరాల కోసం ఐటీడీఏలోని GSUK కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.

News September 24, 2025

హైడ్రా ప్రజావాణికి 49 ఫిర్యాదులు

image

నాలాల ఆక్రమణలపై హైడ్రా ప్రజావాణికి 49 ఫిర్యాదులు అందాయి. నాలాల కబ్జా కారణంగా వర్షం నీరు ఇళ్లలోకి చేరుతోందని ఫిర్యాదు చేశారు. చెరువులను కలిపే నాలాలు ఆక్రమణలకు గురికావడంతో వరద నీరు నేరుగా చెరువుల్లోకి వెళ్లడం లేదని, తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు అధికారులను కోరారు. చెరువుల‌ను అనుసంధానం చేస్తూ సాగే నాలాలు క‌బ్జాల‌కు గురి కావడంతో వ‌ర‌ద నేరుగా చెరువుకు వెళ్ల‌కుండా కాల‌నీల్లోకి వస్తుందని పేర్కొన్నారు.