News September 23, 2025

10 గ్రా. బంగారం ధర రూ.2లక్షలు?.. ‘జెఫరీస్’ అంచనా

image

ప్రపంచ ఆర్థిక అనిశ్చితులతో ఇన్వెస్టర్లు బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా భావిస్తున్నారని, దీంతో ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని ప్రఖ్యాత స్టాక్ బ్రోకరేజ్ సంస్థ ‘జెఫరీస్’ గ్లోబల్ హెడ్ క్రిస్ వుడ్ అంచనా వేశారు. ప్రస్తుతం ఉన్న ధరల నుంచి ఏకంగా 77% మేర పెరగొచ్చని అభిప్రాయపడ్డారు. ఒకవేళ ఇదే నిజమైతే 10గ్రా బంగారం ధర ₹2 లక్షల మార్కును చేరుకోనుంది. అయితే ఎప్పటివరకు గోల్డ్ ఆ మార్క్ అందుకుంటుందో చెప్పలేదు.

Similar News

News September 24, 2025

USA క్రికెట్ సభ్యత్వ హోదాను రద్దు చేసిన ICC

image

యూఎస్ఏ అంతర్జాతీయ సభ్యత్వాన్ని ఐసీసీ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. పదే పదే నిబంధనలు ఉల్లంఘించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. జాతీయ స్థాయిలో గవర్నింగ్ బాడీ హోదాను పొందడంలో పురోగతి లేకపోవడం, సంస్థాగత నిర్మాణంలో వైఫల్యం, యూఎస్‌తో పాటు అంతర్జాతీయంగానూ క్రికెట్‌ను దెబ్బతీసేలా వ్యవహరించడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్నట్లు వెల్లడించింది. దీంతో ICC నిర్వహించే ఈవెంట్లలో యూఎస్ఏ పాల్గొనలేదు.

News September 24, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News September 24, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (సెప్టెంబర్ 24, బుధవారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 4.53 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.05 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.08 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.29 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.11 గంటలకు
✒ ఇష: రాత్రి 7.23 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.