News September 23, 2025

HYD: పిజ్జా ఔట్‌లెట్లపై అధికారుల దాడులు

image

రాష్ట్రవ్యాప్తంగా 55 పిజ్జా ఔట్‌లెట్స్‌పై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. ఇందులో 18 పిజ్జాహట్, 16 డొమినోస్, 21 ఇతర కేంద్రాలు ఉన్నాయి. తనిఖీల్లో కిచెన్లలో అపరిశుభ్రత, వెజ్, నాన్‌వెజ్ వస్తువులను ఒకేచోట నిల్వ ఉంచడం వంటి నిబంధనలు ఉల్లంఘించినట్లు అధికారులు గుర్తించారు. ఫుడ్ శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపారు.

Similar News

News September 24, 2025

మైలార్‌దేవ్‌పల్లిలో సుపారీ గ్యాంగ్ అరెస్ట్

image

మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు సుపారీ గ్యాంగ్‌ను అరెస్టు చేశారు. రూ. 9 లక్షలకు ఇమ్రాన్‌ను హత్య చేయడానికి ముగ్గురు వ్యక్తులు సుపారీ తీసుకున్నారు. గత వ్యాపార వివాదాల కారణంగా షేక్‌ అమీర్‌, మహమ్మద్‌ సోయల్‌ ఈ సుపారీ ఇచ్చారని పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి కత్తులు, సెల్‌ఫోన్లు, వాహనాలు, రూ.10 వేలు స్వాధీనం చేసుకున్నారు.

News September 24, 2025

హైడ్రా ప్రజావాణికి 49 ఫిర్యాదులు

image

నాలాల ఆక్రమణలపై హైడ్రా ప్రజావాణికి 49 ఫిర్యాదులు అందాయి. నాలాల కబ్జా కారణంగా వర్షం నీరు ఇళ్లలోకి చేరుతోందని ఫిర్యాదు చేశారు. చెరువులను కలిపే నాలాలు ఆక్రమణలకు గురికావడంతో వరద నీరు నేరుగా చెరువుల్లోకి వెళ్లడం లేదని, తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు అధికారులను కోరారు. చెరువుల‌ను అనుసంధానం చేస్తూ సాగే నాలాలు క‌బ్జాల‌కు గురి కావడంతో వ‌ర‌ద నేరుగా చెరువుకు వెళ్ల‌కుండా కాల‌నీల్లోకి వస్తుందని పేర్కొన్నారు.

News September 24, 2025

HYD: ర్యాగింగ్ భూతం.. ఈనంబర్లు సేవ్ చేసుకోండి

image

ర్యాగింగ్ భూతానికి ఓ బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం నగరంలో చర్చనీయాంశమైంది. బీటెక్ విద్యార్థి ఇలా ప్రాణం తీసుకోవడం బాధాకరమని, ఇలాంటి ఘటనపై విద్యార్థులు ధైర్యంగా ఫిర్యాదు చేయాలని పోలీసులు కోరుతున్నారు. ట్రై కమిషనరేట్ పరిధిలోని విద్యార్థులు 100, 040-23286966, 8712681251, 040-27853418, 9490617100, 040-27852333, 8712661000, 040-27853030, 8712662666 నంబర్లకు ఫోన్ చేసి సాహాయం పొందవచ్చని సూచించారు.