News April 5, 2024
HYD: 10 లక్షల మందితో జన జాతర సభ: మంత్రి సీతక్క

దేశ ముఖచిత్రాన్ని మార్చేసే కీలకమైన లోక్‌సభ ఎన్నికలకు తెలంగాణ గడ్డ మీద నుంచి 10 లక్షల మందితో జంగ్ సైరన్ ఇవ్వనున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. తుక్కుగూడలో ‘జన జాతర’ పేరిట రేపు నిర్వహించే భారీ బహిరంగ సభలో మేనిఫెస్టోతో పాటు తాము అధికారంలోకి వస్తే అమలు చేయనున్న 5 గ్యారంటీలను కాంగ్రెస్ అగ్ర నాయకత్వం ప్రకటించనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను మంత్రి ఈరోజు పరిశీలించారు.
Similar News
News January 13, 2026
హైదరాబాద్ ఖాళీ.. కాదు రద్దీ.. మీ కామెంట్?

HYD ఖాళీ అయ్యిందని కొందరి SM పోస్టులు వైరల్ అయ్యాయి. సంక్రాంతి కోసం జనాలు సొంతూళ్లకు వెళ్లారని దీని అర్థం. ఈ పరిస్థితి సిటీలో ఓ వైపు మాత్రమే కనిపిస్తోందని మరికొందరి వాదన. పండుగలకు బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో రద్దీ సాధారణమని, సిటీలో ఏ మూలకు వెళ్లిన ట్రాఫిక్ ఉందని చెబుతున్నారు. పల్లెబాట పట్టిన వీడియోలు, సిటీ రష్ వీడియోలు SMలో పోటీ పడుతున్నాయి. మరి మీ ఏరియాలో పరిస్థితి ఏంటి? కామెంట్ చేయండి.
News January 13, 2026
HYD: మట్టిలో పుట్టిన మాణిక్యం.. మర్రి చెన్నారెడ్డి

స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయ ద్రష్ట మర్రి చెన్నారెడ్డి 1919 JAN 13న వికారాబాద్ (D) మార్పల్లి (M) సిరిపురంలో జన్మించారు. MBBS పూర్తి చేసి వైద్యవృత్తిని ప్రజాసేవగా మలిచారు. 1969 TG ఉద్యమంలో కీలక భూమిక పోషిస్తూ తెలంగాణ ప్రజా సమితికి నాయకత్వం వహించారు. ఉద్యమ ఉత్థాన, పతనాల మధ్య పార్టీని రాజకీయ శక్తిగా నిలిపారు. 1978లో మేడ్చల్ నుంచి MLAగా గెలిచి ఉమ్మడి AP CMగా బాధ్యతలు స్వీకరించి చరిత్ర సృష్టించారు.
News January 13, 2026
HYDలో డిమాండ్..ఆ ఒక్కదానికే రూ.2500

HYDలో పెళ్లళ్లకు బ్యూటీషియన్ల డిమాండ్ పెరిగింది. మగువ మొహాన్ని మెరుపుటద్దంలా మార్చే మేకప్, మరింత అందాన్ని తెచ్చే లేటెస్ట్ మెహంది డిజైన్ల కోసం ఖర్చుకు వెనకాడటం లేదు. నెయిల్ పాలిష్ తర్వాత ఒకే వేలుకు మాత్రమే పెట్టే ఒక్క మెరుపు చుక్కకే రూ.2,500 వరకు ఖరీదు చేస్తున్నారు. మల్టీ వ్యూ డిమాండ్ అని పిలిచే ఈ మెరుపు చుక్కలో నిలబడి చూస్తే ‘వధూవరులు’ మెరుస్తూ కనిపిస్తారు.


