News September 23, 2025
జగిత్యాల: అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకానికి దరఖాస్తుల గడవు పెంపు

అంబేడ్కర్ ఓవర్సీసీ విద్యానిధి పథకానికి దరఖాస్తుల గడువును పొడిగించినట్లు జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి రాజ్ కుమార్ తెలిపారు. దరఖాస్తుల గడువును సెప్టెంబర్ 23 నుండి నవంబర్ 19 వరకు పొడిగించినట్లు పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా షెడ్యూల్ కులాలకు చెందిన విద్యార్థులకు విదేశీ విద్యాలయాలలో విద్యను అభ్యసించడానికి రూ.20 లక్షల స్కాలర్షిప్ అందించడం జరుగుతుందన్నారు.
Similar News
News September 24, 2025
భూసేకరణ వేగవంతం చేయండి: కలెక్టర్ వెట్రిసెల్వి

జిల్లాలో జాతీయ రహదారులకు సంబందించిన భూసేకరణ వేగవంతం చేయాలనీ జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఏలూరు కలెక్టరేట్లో సంబంధిత శాఖల అధికారులు, జాతీయ రహదారులకు సంబంధించిన అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ మంగళవారం సమీక్షించారు. జిల్లాలో జాతీయ రహదారుల నిర్మాణానికి సంబంధించి కోర్ట్‌లలో ఉన్న కేసులు త్వరితగతిన పరిష్కారం అయ్యేలా చూడాలన్నారు.
News September 24, 2025
ఇక ఆ 29 సారా రహిత గ్రామాలు: కలెక్టర్

‘నవోదయం’ కార్యక్రమం ద్వారా అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 8 మండలాల్లోని 29 గ్రామాలను సారా రహిత గ్రామాలుగా ప్రకటించినట్లు కలెక్టర్ మహేశ్ కుమార్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఈ కార్యక్రమంపై ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. సారా రహిత సమాజ నిర్మాణానికి అందరూ కృషి చేయాలని మహేశ్ కుమార్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ రాహుల్ మీనా, డీఆర్ఓ మాధవి పాల్గొన్నారు.
News September 24, 2025
అమరావతి మునిగిపోయిందని పోస్టు చేసిన ఉద్యోగి సస్పెండ్

AP: అమరావతి మునిగిపోయిందంటూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టిన తిరుపతి GST అసిస్టెంట్ కమిషనర్ సుభాష్‌ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ‘అమరావతిలో 3 రిజర్వాయర్లు ఎందుకు? అమరావతినే ఒక రిజర్వాయర్‌గా కడితే పోలా? ఒకే ఒక్క వర్షం అమరావతి జలమయం’ అని AUG 19న పోస్టు చేశారు. ప్రభుత్వ ఉద్యోగి పోస్టులు వ్యక్తిగతం కావని, ప్రజలను ప్రభావితం చేయడంతో పాటు సర్వీస్ నిబంధనలను ఉల్లంఘించినట్లు అవుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.