News September 23, 2025

‘బ్రహ్మచారిణీ దేవిని పూజించడం వల్ల మానసిక ఒత్తిళ్లు తొలగుతాయి’

image

దేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా శ్రీశైల భ్రమరాంబికా దేవి అమ్మవారు బ్రహ్మచారిణీ స్వరూపంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. నవ దుర్గలలో ద్వితీయ రూపమైన ఈ దేవిని పూజించడం వల్ల విశేష ఫలితాలు కలగగడంతో పాటు సర్వతా విజయాలు లభిస్తాయి. ఈ దేవిని పూజించడం వలన మానసిక ఒత్తిళ్లు తొలగిపోతాయి. ద్విభుజురాలైన ఈ దేవి కుడిచేతిలో జపమాల, ఎడమచేతిలో కమండలాన్ని ధరించి ఉంటుంది.

Similar News

News September 24, 2025

కాగితంపై పులిలా రష్యా.. ట్రంప్ కవ్వింపు

image

ఉక్రెయిన్‌తో మూడున్నరేళ్లుగా యుద్ధం కొనసాగిస్తున్న రష్యా కాగితంపై పులిలా వ్యవహరిస్తుందని US అధ్యక్షుడు ట్రంప్ SMలో పోస్ట్ చేశారు. EU సహకారంతో రష్యా నుంచి భూభాగాన్ని వెనక్కి తీసుకోవడమే కాకుండా ఉక్రెయిన్ విజయం సాధిస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు. రష్యా ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని, చర్యలు తీసుకునేందుకు ఉక్రెయిన్‌కు ఇదే సరైన సమయమన్నారు. నాటో దేశాలకు ఆయుధాల సరఫరాను కొనసాగిస్తామని ట్రంప్ పేర్కొన్నారు.

News September 24, 2025

మైలార్‌దేవ్‌పల్లిలో సుపారీ గ్యాంగ్ అరెస్ట్

image

మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు సుపారీ గ్యాంగ్‌ను అరెస్టు చేశారు. రూ. 9 లక్షలకు ఇమ్రాన్‌ను హత్య చేయడానికి ముగ్గురు వ్యక్తులు సుపారీ తీసుకున్నారు. గత వ్యాపార వివాదాల కారణంగా షేక్‌ అమీర్‌, మహమ్మద్‌ సోయల్‌ ఈ సుపారీ ఇచ్చారని పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి కత్తులు, సెల్‌ఫోన్లు, వాహనాలు, రూ.10 వేలు స్వాధీనం చేసుకున్నారు.

News September 24, 2025

జనగామ: 76 వేల మందికి రూ.500లకే వంట గ్యాస్..!

image

నానాటికి పెరుగుతున్న ధరల ప్రభావం పేద ప్రజలపై పడకూడదన్న సంకల్పంతో ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద రూ.500లకే వంట గ్యాస్ సరఫరా చేస్తోంది. ఇందులో భాగంగా జనగామ జిల్లాలో ఇప్పటివరకు 76,430 మంది వినియోగదారులకు 500లకే వంట గ్యాస్ సరఫరా చేశారు. కొత్త రేషన్ కార్డులు వచ్చిన నేపథ్యంలో వినియోగదారులు మరింత పెరిగే అవకాశం ఉంది.