News September 23, 2025

హైదరాబాద్ అభివృద్ధి పనులపై కమిషనర్ సమీక్ష

image

నగరంలో అభివృద్ధి పనులపై జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ సమీక్ష నిర్వహించారు. ఎస్‌ఆర్‌డీపీ, ఎస్‌ఎన్‌డీపీ, హెచ్‌-సిటీ ప్రాజెక్టులు, చెరువుల అభివృద్ధి పనులను పర్యవేక్షించారు. ఎస్‌ఎన్‌డీపీ, సరస్సుల పనులను క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని జోనల్ కమిషనర్లకు ఆదేశించారు. ట్రాఫిక్ సమస్యలపై పోలీసులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.

Similar News

News September 24, 2025

రాజేంద్రనగర్‌లో కత్తితో గొంతుకోసి హత్య

image

రాజేంద్రనగర్‌లో బుధవారం ఉదయం ఓ వ్యక్తి డెడ్‌బాడీ కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఏసీపీ శ్రీనివాస్ ఘటన స్థలాన్ని పరిశీలించి, వివరాలు వెల్లడించారు. కత్తితో గొంతుకోసి హత్య చేసినట్లు ఆనవాళ్లు ఉన్నాయని, ఎక్కడో హత్య చేసి ఇక్కడ పడేసినట్లుగా అనుమానం వ్యక్తం చేశారు. చనిపోయిన వ్వక్తి బండ్లగూడకు చెందిన మీనాస్ ఉద్దీన్‌గా గుర్తించారు. సీసీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు కొనసాగుతోందన్నారు.

News September 24, 2025

HYD: ప్రేమ పేరుతో బాలికపై లైంగిక దాడి

image

HYD శివారు ఆదిభట్ల PS పరిధిలో దారుణం జరిగింది. RGK కుర్మల్‌గూడలో మైనర్ బాలికపై యువకుడు లైంగిక దాడి చేశాడు. ప్రేమ పేరుతో ఆమెకు దగ్గరైన యువకుడు ఇంటికి తీసుకెళ్లి బలవంతం చేశాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఆదిభట్ల పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో పాటు పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.

News September 23, 2025

HYD: ‘గుంతల పూడ్చివేత నిరంతర ప్రక్రియ’

image

హైదరాబాద్ నగరంలో రోడ్లపై గుంతల పూడ్చివేత కార్యక్రమం నిరంతరంగా కొనసాగుతుందని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ అన్నారు. నగరంలో మొత్తం 14,631 గుంతలను గుర్తించగా.. వాటిలో 12,181 గుంతలు పూడ్చివేశామన్నారు. గుంతల పూడ్చివేత నిరంతర ప్రక్రియ అని, నాలా పూడికతీత పనులు, చెత్త కుప్పలను సిబ్బందితో కాకుండా యంత్రాలతో శుభ్రం చేయించాలని అధికారులకు ఆదేశించారు.