News September 23, 2025

విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కోవాలి: కలెక్టర్

image

వరద విపత్తులు వస్తే సమర్థవంతంగా ఎదుర్కోవాల్సిన బాధ్యత సర్పంచ్‌లు, అధికారులపై ఉందని కలెక్టర్ వినోద్ కుమార్ మంగళవారం చెప్పారు. విపత్తును ఎదుర్కోవడానికి సర్పంచ్‌లు, అధికారులు సంసిద్ధం కావాలన్నారు. లంక గ్రామాల ప్రజలకు ఎలాంటి నష్టం జరగకుండా తాను అండగా ఉంటానన్నారు. ఎలాంటి ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. సమాజంలో నాయకులుగా ఉన్న సర్పంచులు ప్రభుత్వంతో కలిసి పని చేయాలన్నారు.

Similar News

News September 24, 2025

HYD: వాడిన నూనెనే..మళ్లీ మళ్లీ.!

image

HYD పిజ్జా, డొమినోస్, మాస్టర్ బేకరీలలో ఫుడ్ సేఫ్టీ అధికారుల మంగళవారం ఆకస్మిక తనిఖీలతో అనేక లోపాలు బట్టబయలయ్యాయి. వాడిన నూనె మళ్లీ మళ్లీ వాడుతున్నట్లు గుర్తించారు. పన్నీర్‌కు లేబులింగ్ లేకపోవడంతో నోటీసులు జారీ చేశారు. ఓవర్ యూజ్ ఆయిల్ ఆరోగ్యానికి హానికరమని అధికారులు హెచ్చరించారు. ఇలాంటి లోపాలు ఇతర రెస్టారెంట్లలోనూ కనిపిస్తున్నాయి.

News September 24, 2025

దొంగతనాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

image

దసరా సెలవుల్లో ఇళ్లకు తాళాలు వేసి ఊర్లకు వెళ్లే ప్రజలు ముందస్తుగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ మంగళవారం వెల్లడించారు. విలువైన వస్తువులను బ్యాంకు లాకర్లలో ఉంచాలన్నారు. ఇంటి బయట లోపల ఒకటి లేదా రెండు లైట్లు వేసి ఉంచాలని, సాధ్యమైనంత వరకు ఇళ్లకు సీసీ కెమెరాలను అమర్చుకోవాలన్నారు. సెలవులు ముగిసేంత వరకు కాలనీలలో సంక్షేమ సంఘాలు గస్తీని ఏర్పాటు చేసుకోవాలన్నారు.

News September 24, 2025

ఫోటో, వీడియో కెమెరామెన్ పోస్టులకు దరఖాస్తు చేసుకోండి: కలెక్టర్

image

భద్రాద్రి జిల్లా ప్రజా సంబంధాల అధికారి కార్యాలయంలో ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేయుటకు ఫోటో కెమెరామెన్ (1), వీడియో కెమెరామెన్ (1) పోస్టుల భర్తీకి అర్హతగల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ తెలిపారు. ఈ నెల 26వ తేదీ శుక్రవారం సాయంత్రం 5 గంటల లోగా దరఖాస్తులు కార్యాలయంలో సమర్పించాలని ఆయన సూచించారు.