News September 23, 2025

‘ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ పునఃప్రారంభానికి ఏర్పాట్లు’

image

మెట్‌పల్లి మండలం ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని పునఃప్రారంభించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ తెలిపారు. ఈ నెల 26న ఉన్నతాధికారులతో కలిసి ఫ్యాక్టరీని సందర్శిస్తామని, రైతులను కలుస్తామని చెప్పారు. ఈ పర్యటనలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఐటీ కార్యదర్శి, ఎస్పీ అశోక్ కుమార్, వ్యవసాయశాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.

Similar News

News September 24, 2025

ఫోటో, వీడియో కెమెరామెన్ పోస్టులకు దరఖాస్తు చేసుకోండి: కలెక్టర్

image

భద్రాద్రి జిల్లా ప్రజా సంబంధాల అధికారి కార్యాలయంలో ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేయుటకు ఫోటో కెమెరామెన్ (1), వీడియో కెమెరామెన్ (1) పోస్టుల భర్తీకి అర్హతగల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ తెలిపారు. ఈ నెల 26వ తేదీ శుక్రవారం సాయంత్రం 5 గంటల లోగా దరఖాస్తులు కార్యాలయంలో సమర్పించాలని ఆయన సూచించారు.

News September 24, 2025

ప్రతీ జట్టు టీమ్ ఇండియాను ఓడించగలదు: బంగ్లా కోచ్

image

టీమ్ ఇండియాను ఓడించే సత్తా ప్రతి జట్టుకూ ఉంటుందని బంగ్లాదేశ్ కోచ్ ఫిల్ సిమ్మన్స్ అన్నారు. మ్యాచ్ రోజున మైదానంలో అత్యుత్తమ ప్రదర్శన చేసిన జట్టే విజేతగా నిలుస్తుందని చెప్పారు. గత రికార్డులు విన్నర్‌ను డిసైడ్ చేయలేవన్నారు. మూడున్నర గంటల్లో ఆడే తీరు ఫలితాన్ని నిర్ణయిస్తుందని చెప్పారు. బంగ్లా బౌలింగ్ అద్భుతంగా ఉందని ఇవాళ భారత్‌తో మ్యాచులో కచ్చితంగా మెరుగైన ప్రదర్శన చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.

News September 24, 2025

HYD నుంచి బందర్ పోర్టు వెళ్లేందుకు గ్రీన్ ఫీల్డ్ హైవే

image

హైదరాబాద్ నుంచి బందర్ పోర్టు వరకు గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణానికి త్వరగా రూట్ మ్యాప్ ఖరారు చేయాలని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్-శ్రీశైలం హైవేలో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి కేంద్రం నుంచి అనుమతులు తీసుకోవాలన్నారు. ఇందుకు గ్రౌండ్ వర్క్ ప్రారంభించినట్లు అధికారులు వివరించారు.