News September 23, 2025
జగిత్యాల: ఇందిరమ్మ మైనారిటీ మహిళ యోజన దరఖాస్తుల ఆహ్వానం

జగిత్యాల జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఇందిరమ్మ మైనారిటీ మహిళ యోజన స్కీం కింద దరఖాస్తులు ఆహ్వానించనున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి తెలిపారు. ముస్లిం, సిఖ్, బుద్ధిస్ట్, జైన్స్, పార్సీలు వంటి మైనారిటీ కమ్యూనిటీల మహిళలు అర్హులన్నారు. ఆసక్తిగల వారు tgobmms.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్లైన్‌లో OCT 6 లోపు దరఖాస్తు చేసుకోవచ్చని సంక్షేమ అధికారి తెలిపారు.
Similar News
News September 24, 2025
ఫోటో, వీడియో కెమెరామెన్ పోస్టులకు దరఖాస్తు చేసుకోండి: కలెక్టర్

భద్రాద్రి జిల్లా ప్రజా సంబంధాల అధికారి కార్యాలయంలో ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేయుటకు ఫోటో కెమెరామెన్ (1), వీడియో కెమెరామెన్ (1) పోస్టుల భర్తీకి అర్హతగల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ తెలిపారు. ఈ నెల 26వ తేదీ శుక్రవారం సాయంత్రం 5 గంటల లోగా దరఖాస్తులు కార్యాలయంలో సమర్పించాలని ఆయన సూచించారు.
News September 24, 2025
ప్రతీ జట్టు టీమ్ ఇండియాను ఓడించగలదు: బంగ్లా కోచ్

టీమ్ ఇండియాను ఓడించే సత్తా ప్రతి జట్టుకూ ఉంటుందని బంగ్లాదేశ్ కోచ్ ఫిల్ సిమ్మన్స్ అన్నారు. మ్యాచ్ రోజున మైదానంలో అత్యుత్తమ ప్రదర్శన చేసిన జట్టే విజేతగా నిలుస్తుందని చెప్పారు. గత రికార్డులు విన్నర్‌ను డిసైడ్ చేయలేవన్నారు. మూడున్నర గంటల్లో ఆడే తీరు ఫలితాన్ని నిర్ణయిస్తుందని చెప్పారు. బంగ్లా బౌలింగ్ అద్భుతంగా ఉందని ఇవాళ భారత్‌తో మ్యాచులో కచ్చితంగా మెరుగైన ప్రదర్శన చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.
News September 24, 2025
HYD నుంచి బందర్ పోర్టు వెళ్లేందుకు గ్రీన్ ఫీల్డ్ హైవే

హైదరాబాద్ నుంచి బందర్ పోర్టు వరకు గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణానికి త్వరగా రూట్ మ్యాప్ ఖరారు చేయాలని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్-శ్రీశైలం హైవేలో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి కేంద్రం నుంచి అనుమతులు తీసుకోవాలన్నారు. ఇందుకు గ్రౌండ్ వర్క్ ప్రారంభించినట్లు అధికారులు వివరించారు.