News September 23, 2025
KNR: బాల సదన్, శిశు గృహాన్ని సందర్శించిన సీనియర్ సివిల్ జడ్జి

పట్టణంలోని బాల సదన్, శిశు గ్రహాలను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రెటరీ, సీనియర్ సివిల్ జడ్జ్ కే.వెంకటేష్ సందర్శించారు. ఈ సందర్భంగా చిన్నారులతో ముచ్చటిస్తూ కష్టపడి చదువుకుని ప్రథమ స్థానంలో ఉత్తీర్ణత సాధించాలని తెలియజేశారు. శిశు గృహాలలోని వంట, ఆహార పదార్థాలను నిలువచేసే గదులను తనిఖీ చేశారు. పిల్లలు క్రమశిక్షణను అలవర్చుకోవాలని, శిశు గృహ లోని పిల్లల యొక్క ఆరోగ్య సమస్యలపై శ్రద్ధ వహించాలని కోరారు.
Similar News
News September 23, 2025
KNR: హైపటైటిస్ వ్యాక్సినేషన్ పరిశీలించిన కలెక్టర్

వైద్య విధాన పరిషత్ పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రభుత్వ మెడికల్ కళాశాలలో పనిచేస్తున్న వైద్యులు, సిబ్బందికి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో నిర్వహిస్తున్న హైపటైటిస్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పరిశీలించారు. నేషనల్ వైరల్ హైపటైటిస్ కంట్రోల్ ప్రోగ్రాం ద్వారా హైపటైటిస్ వ్యాధిగ్రస్తుల నుండి వైద్యులు, సిబ్బందికి వ్యాధి ప్రబలకుండా ముందు జాగ్రత్తగా కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
News September 23, 2025
‘కరీంనగర్లో ఆయుర్వేద సేవలు అందిపుచ్చుకోవాలి’

కరీంనగర్లో ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా నేడు రామ్‌నగర్‌లోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆయుర్వేద ఔషధాలు, యోగాసనాలను పరిశీలించి, ఉచిత సేవల వివరాలను రోగులకు తెలియజేయాలని ఆదేశించారు. గర్భిణీలకు యోగాసనాల అవగాహన, ఆస్పత్రి ఆవరణలో స్వచ్ఛత, మొక్కల నాటడం చేయాలన్నారు.
News September 23, 2025
కరీంనగర్: వైద్య సిబ్బందికి హెపటైటిస్ బీ టీకా

కరీంనగర్ జిల్లా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో హెపటైటిస్ వ్యాధిగ్రస్తులకు చికిత్స అందించే వైద్యులు, వైద్య సిబ్బంది, ఇతర కార్మికులకు హెపటైటిస్ బీ వాక్సినేషన్ కార్యక్రమాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఆరోగ్య సంరక్షణలో పనిచేసే సిబ్బందికి రోగనిరోధక శక్తిని పెంచే ఉద్దేశంతో ఈ టీకా కార్యక్రమం మొదలుపెట్టినట్లు ఆయన తెలిపారు.