News September 24, 2025

క్రికెట్ నుంచి బ్రేక్.. శ్రేయస్‌ నిర్ణయం?

image

టీమ్ ఇండియా క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ రెడ్ బాల్ క్రికెట్ నుంచి బ్రేక్ తీసుకోవాలని డిసైడైనట్లు తెలుస్తోంది. వెన్ను నొప్పి కారణంతో తాను లాంగెస్ట్ ఫార్మాట్‌కు కొన్ని రోజులు దూరంగా ఉండాలనుకుంటున్నానని ఆయన బీసీసీఐకి లేఖ రాసినట్లు క్రీడా వర్గాలు పేర్కొన్నాయి. దీనిపై అయ్యర్ లేదా బీసీసీఐ నుంచి స్పష్టత రావాల్సి ఉంది. మరోవైపు ఆస్ట్రేలియా-Aతో ఈరోజు ప్రారంభమైన రెండో అన్‌అఫీషియల్ టెస్టుకూ శ్రేయస్ దూరమయ్యారు.

Similar News

News September 24, 2025

ఇవాళ తిరుమలకు చంద్రబాబు

image

AP: సీఎం చంద్రబాబు ఇవాళ తిరుమలలో పర్యటించనున్నారు. సాలకట్ల బ్రహ్మోత్సవాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి CBN దంపతులు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ఇవాళ సా.6.20 గంటలకి తిరుమల చేరుకుంటారు. రా.7.40 గంటలకు శ్రీవారిని దర్శించుకుంటారు. రేపు ఉదయం తిరుమలలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభిస్తారు. అనంతరం విజయవాడకు బయల్దేరుతారు.

News September 24, 2025

ప్రతీ జట్టు టీమ్ ఇండియాను ఓడించగలదు: బంగ్లా కోచ్

image

టీమ్ ఇండియాను ఓడించే సత్తా ప్రతి జట్టుకూ ఉంటుందని బంగ్లాదేశ్ కోచ్ ఫిల్ సిమ్మన్స్ అన్నారు. మ్యాచ్ రోజున మైదానంలో అత్యుత్తమ ప్రదర్శన చేసిన జట్టే విజేతగా నిలుస్తుందని చెప్పారు. గత రికార్డులు విన్నర్‌ను డిసైడ్ చేయలేవన్నారు. మూడున్నర గంటల్లో ఆడే తీరు ఫలితాన్ని నిర్ణయిస్తుందని చెప్పారు. బంగ్లా బౌలింగ్ అద్భుతంగా ఉందని ఇవాళ భారత్‌తో మ్యాచులో కచ్చితంగా మెరుగైన ప్రదర్శన చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.

News September 24, 2025

బతుకమ్మకుంట: హైడ్రా కమిషనర్ బోటులో షికారు

image

TG: హైదరాబాద్‌లోని అంబర్‌పేట్‌లో <<16988578>>హైడ్రా<<>> పునరుద్ధరించిన బతుకమ్మకుంటలో కమిషనర్ రంగనాథ్ బోటులో షికారుకెళ్లారు. ఈ నెల 26న జరగనున్న బతుకమ్మ ఉత్సవ ఏర్పాట్లను ఆయన కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా హైడ్రా పనితీరును వీహెచ్ ప్రశంసించారు. ఎల్లుండి సీఎం రేవంత్ రెడ్డి ఈ కుంటను నగర ప్రజలకు అంకితం ఇవ్వనున్నారు.