News September 24, 2025

రేపు విజయవాడకు ఉపరాష్ట్రపతి రాక

image

AP: వైస్ ప్రెసిడెంట్ C.P రాధాకృష్ణన్, ఆయన సతీమణి సుమతి బుధవారం మధ్యాహ్నం విజయవాడకు రానున్నారు. విమానాశ్రయంలో CM చంద్రబాబు వారికి స్వాగతం పలకనున్నారు. అనంతరం ఉపరాష్ట్రపతి దంపతులు కనకదుర్గా అమ్మవారిని దర్శించుకుంటారు. సాయంత్రం జరిగే విజయవాడ ఉత్సవ్‌లో చీఫ్ గెస్టుగా పాల్గొంటారు. అనంతరం IAF ప్రత్యేక విమానంలో తిరుపతికి వెళ్తారు. రోడ్డు మార్గంలో తిరుమలకు చేరుకొని స్వామివారిని దర్శించుకోనున్నారు.

Similar News

News September 24, 2025

బొప్పాయి, ఫైనాపిల్ గర్భిణులు తినకూడదా?

image

గర్భిణులు బొప్పాయి, పైనాపిల్ తింటే గర్భస్రావం జరుగుతుందని పెద్దలు చెబుతూ ఉంటారు. అందుకే వాటికి దూరంగా ఉండాలంటుంటారు. అయితే ఇందులో వాస్తవం లేదని గైనకాలజిస్టులు చెబుతున్నారు. గర్భిణులు బాగా పండిన బొప్పాయి, పైనాపిల్ తినడం వల్ల ఎలాంటి ప్రమాదం లేదని స్పష్టం చేస్తున్నారు. అపోహలను పక్కనపెట్టాలని సూచిస్తున్నారు. పచ్చి బొప్పాయి, పచ్చి పైనాపిల్ ఎక్కువగా తింటే మాత్రమే సమస్య ఉంటుందంటున్నారు.
#ShareIt

News September 24, 2025

దేవదేవుని దివ్యోత్సవాలకు సమయం ఆసన్నం

image

శ్రీవారి భక్తులు వేయికళ్లతో ఎదురుచూస్తున్న సాలకట్ల బ్రహ్మోత్సవాలకు సమయం ఆసన్నమైంది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి వేడుకలకు తిరుమల సిద్ధమైంది. నేటి నుంచి అక్టోబరు 2 వరకు బ్రహ్మోత్సవాలు జరగుతాయి. నేడు సాయంత్రం 5.43 నుంచి 6.15 మధ్య మీనలగ్నంలో ధ్వజారోహణ కార్యక్రమం ఉంటుంది. ఇందుకు అవసరమైన దర్భచాప, తాడును ఊరేగింపుగా ఆలయ సన్నిధికి చేర్చారు. స్వామివారు నేడు పెద్దశేష వాహనంపై భక్తులకు దర్శనం ఇస్తారు.

News September 24, 2025

నవదుర్గలు – అలంకారాలు

image

బాలాత్రిపుర సుందరీ దేవి: లేత గులాబీ రంగు చీర, తుమ్మి పుష్పం
గాయత్రీ దేవి: నారింజ రంగు చీర, తామర పుష్పం
అన్నపూర్ణా దేవి: గంధం రంగు చీర, పొగడ పుష్పం
లలితా త్రిపుర సుందరీ దేవి: బంగారు రంగు చీర, ఎర్ర కలువ
మహాలక్ష్మీ దేవి: గులాబీ రంగు చీర, తెల్ల కలువ
సరస్వతీ దేవి: తెల్ల చీర, మారేడు దళాలు
దుర్గాదేవి: ఎర్ర చీర, మందారాలు
మహిషాసుర మర్దని: ఎరుపు నేత చీర, నల్ల కలువ
రాజరాజేశ్వరీ దేవి: ఆకుపచ్చ చీర, ఎర్ర పూలు