News September 24, 2025
HYD: ర్యాగింగ్ భూతం.. ఈనంబర్లు సేవ్ చేసుకోండి

ర్యాగింగ్ భూతానికి ఓ బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం నగరంలో చర్చనీయాంశమైంది. బీటెక్ విద్యార్థి ఇలా ప్రాణం తీసుకోవడం బాధాకరమని, ఇలాంటి ఘటనపై విద్యార్థులు ధైర్యంగా ఫిర్యాదు చేయాలని పోలీసులు కోరుతున్నారు. ట్రై కమిషనరేట్ పరిధిలోని విద్యార్థులు 100, 040-23286966, 8712681251, 040-27853418, 9490617100, 040-27852333, 8712661000, 040-27853030, 8712662666 నంబర్లకు ఫోన్ చేసి సాహాయం పొందవచ్చని సూచించారు.
Similar News
News September 24, 2025
HYD: మూసీ వద్ద మహిళ మృతదేహం.. ముగ్గురి అరెస్ట్

మూసీ నది వద్ద లభ్యమైన మహిళా మృతదేహం కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. మహిళను అత్యాచారం చేసి హత్య చేసిన ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. దుర్గారెడ్డి, గులామ్ దస్తగిర్ ఖాన్, మొహమ్మద్ ఇమ్రాన్‌లను అదుపులోకి పోలీసులు తీసుకున్నారు. ఇద్దరు ఆటో డ్రైవర్లు గ్యాంగ్ రేప్ చేసి, కర్రలతో హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది.
News September 24, 2025
కూకట్‌పల్లిలో ఇంట్లోకి వెళ్లి దాడి.. అక్రమ సంబంధమే కారణమా !

కూకట్‌పల్లి సుమిత్రానగర్‌లో ముసుగులు ధరించిన ఇద్దరు ఇంట్లోకి చొరబడి భూపాల్‌పై దాడి చేశారు. ఈ క్రమంలో తన భార్య చంద్రకళ వివాహేతర సంబంధంపై భూపాల్ అనుమానం వ్యక్తం చేశారు. 5ఏళ్ల క్రితం తమ పెళ్లి జరగ్గా, ప్రస్తుతం ఆమె మరో వ్యక్తితో వివహేతర సంబంధం ఉందని, ఆ విషయమై గొడవ జరగడంతో దుర్గయ్య అనే వ్యక్తితో కలిసి ఆమె దాడి చేయించిందని భూపాల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News September 24, 2025
మైలార్‌దేవ్‌పల్లిలో సుపారీ గ్యాంగ్ అరెస్ట్

మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు సుపారీ గ్యాంగ్‌ను అరెస్టు చేశారు. రూ. 9 లక్షలకు ఇమ్రాన్‌ను హత్య చేయడానికి ముగ్గురు వ్యక్తులు సుపారీ తీసుకున్నారు. గత వ్యాపార వివాదాల కారణంగా షేక్ అమీర్, మహమ్మద్ సోయల్ ఈ సుపారీ ఇచ్చారని పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి కత్తులు, సెల్‌ఫోన్లు, వాహనాలు, రూ.10 వేలు స్వాధీనం చేసుకున్నారు.